న్యూ ఇయర్ కానుక... తగ్గనున్న బంగారం ధరలు ?

VAMSI
కరోనా సమయంలో బంగారం ధరలు కూడా ఆకాశాన్ని అంటాయి. శుభ కార్యాలకు, పండుగలకు భారీగా అమ్ముడు పోయే బంగారం ఈ కరోనా నేపథ్యంలో పెద్దగా సేల్ కాలేదనే అంటున్నారు. అయితే నూతన సంవత్సరం పసిడి ప్రేమికులకు లడ్డు లాంటి శుభవార్తను అందించబోతుందని సమాచారం. రానున్న రోజుల్లో బంగారం ధరలు భారీగా తగ్గబోతున్నాయి అంటూ గోల్డ్ మార్కెట్ నుండి వార్తలు  వినవడుతున్నాయి. పసిడి రేటు బాగా  పడిపోబోతుందని తెలుస్తోంది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి కొత్త సంవత్సరం బాగా కలిసి రానుంది మరి.
ఇది నిజంగా బంగారు ప్రియులకు ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా పయణించి ధరలు తగ్గబోతున్నాయట. అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రతికూల పరిస్థితులు కారణంగానే ఇలా ధరలు తగ్గబోతున్నాయి అని ప్రధానంగా చెప్పుకోవచ్చు. గోల్డ్ రేటుపై ప్రభావం చూపే అంశాలు ఇవేనంటూ సమాచారం. ఇంతకీ ఆ కారణాలు ఏంటో ఇపుడు చూద్దాం.  
అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, ద్రవ్యోల్బణం, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు, వడ్డీ రేట్లు, వాణిజ్య యుద్ధాలు,  పసిడి రేటుపై ప్రభావం చూపబోతున్నాయని సమాచారం. అయితే గత కొద్ది రోజులుగా బంగారం రేట్లు స్వల్పంగా పెరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారానికి బుల్లిష్ ట్రెండ్ ఉన్న కారణంగా, దేశీయంగా కూడా ధరలు మెల్లమెల్లగా పెరుగుతూ వస్తున్నాయి.  కాగా రానున్న రోజుల్లో బంగారం తగ్గుతుందన్న వార్తలు కాస్త ఊరట కలిగిస్తున్నాయి.
అయితే గత రెండు సంవత్సరాలుగా ప్రపంచంలోని అన్ని వస్తువుల ధరలు అనుకున్నట్లు తగ్గడం లేదా పెరగడం జరగడం లేదు. అంతా కరోనా మూలంగానే అన్న విషయం తెలిసి ఉంటుంది.  ఇప్పుడు కూడా కరోనా వేరియంట్ అయిన ఓమైక్రాన్ వేట మొదలెట్టింది. ఫలితం ఎలా ఉంటుందో అప్పుడే చెప్పలేము.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: