గ్లోబల్ గోల్డ్ రేట్ ట్రెండ్‌ ఎఫెక్ట్ ఇండియాలో... ఈరోజు బంగారం ధరలు

Vimalatha
గ్లోబల్ గోల్డ్ రేట్ ట్రెండ్‌ ఎఫెక్ట్ ఇండియాలో కనబడుతుంది. భారతీయ బంగారం ధరలు రూ. 170/10 గ్రాములు పెరిగింది. నవంబర్ 21న అంటే ఈరోజు భారతదేశంలో 22 క్యారెట్ల బంగారం ధరలు రూ. 48,270/10 గ్రాములు, 24 క్యారెట్ల బంగారం ధరలు రూ. 49,270/10 గ్రాములుగా ఉంది. అయితే, ఢిల్లీ, పుణె, హైదరాబాద్, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో బంగారం ధరలు నేడు దాదాపు రూ. నేడు 250 నుంచి 280/10 గ్రాములకు పెరిగింది. ఈరోజు వెండి ధర తగ్గింది. కేజీ వెండి ధర రూ.65,600 లకు చేరుకుంది.
కామెక్స్ గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్స్ 0.53% పడిపోయి, $ 1851/oz వద్ద కోట్ అయ్యాయి. అయితే స్పాట్ గోల్డ్ ధరలు మాత్రం 0.73% తగ్గాయి. చివరి ట్రేడింగ్ వరకు $ 1846 / oz వద్ద ట్రేడ్ అయ్యాయి. నిన్న కామెక్స్ డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ $ 1861/oz వద్ద ముగిసింది. కానీ అంతలోపు ఒకసారి $ 1844/oz కి పడిపోయింది. మరోవైపు స్పాట్‌ మార్కెట్‌లో అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 96.02 వద్ద కొనసాగుతోంది. అదే గ్లోబల్ గోల్డ్ రేట్ ట్రెండ్‌ ఎఫెక్ట్ ఇండియాలో పడగా, భారతదేశంలో అక్టోబర్ ఫ్యూచర్‌లో ముంబై MCX బంగారం కూడా 0.40% పడిపోయింది. చివరి ట్రేడింగ్ వరకు రూ. 48,864/10 గ్రాములకు చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు గత 5 రోజుల నుండి స్వల్పంగా తగ్గుతున్నాయి. అయితే ప్రస్తుత నెల మొదటి రెండు వారాలలో ట్రెండ్ ఉత్తర దిశగా సాగుతోంది. కానీ ప్రస్తుతం మార్కెట్ రాబోయే ఫెడ్ చైర్మన్ పేరు గురించి చాలా జాగ్రత్తగా ఉంది. పెట్టుబడిదారులు పావెల్ ఫెడ్ చైర్‌గా కొనసాగుతారని లేదా ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ లేల్ బ్రెయినార్డ్ ఆ పదవిని చేపడతారని ఊహాగానాలు చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: