అత్యధిక బంగారం నిల్వలు ఎక్కడ ఉన్నాయో తెలుసా ?

Vimalatha
22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ. 44,510, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,560, కిలో వెండి ధ‌ర రూ.69,600 వద్ద ఉన్నాయి.
మనం తరచుగా బంగారం గురించి మాట్లాడుకుంటూనే ఉంటాము. మరి ఎప్పుడైనా అనిపించిందా ? అసలు దేశంలో అత్యధికంగా బంగారం నిల్వలు ఎక్కడ ఉన్నాయి అని డౌట్ వచ్చిందా ? అయితే దేశంలో పేద రాష్ట్రమైన బీహార్ లోనే బంగారం నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. ఇది నిజంగానే ఆశ్చర్యం కలిగించే విషయం. ఇంకా కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్‌లో కూడా బంగారు నిల్వలు ఉన్నాయి. కానీ దేశంలో దాదాపు 42 శాతం బంగారం నిల్వలు బీహార్‌ లోనే ఉన్నాయి. అయితే దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో జరిగినట్లుగా ఇక్కడ బంగారు తవ్వకాలు ఆ స్థాయిలో జరగలేదు. దేశం లోని ఏ రాష్ట్రంలోనూ ఇంత భారీ బంగారు నిల్వలు లేవు. అయినప్పటికీ బీహార్ ఇప్పటికీ దేశం లోని పేద రాష్ట్రాలలో ఒకటి కావడం గమనార్హం. బీహార్ లోని గయ, రాజ్‌గిర్, జాముయ్‌లో ఎక్కవగా బంగారు నిల్వలు ఉన్నాయి.
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా,నేషనల్ మినరల్ ఇన్వెంటరీ డేటా ప్రకారం దేశంలో 501.83 మిలియన్ టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయని చెప్పారు. బీహార్, కర్ణాటకలో పెద్ద మొత్తంలో బంగారం నిల్వలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకారం దేశంలో 42.21 శాతం బంగారం నిల్వలు బీహార్ లోనే ఉన్నాయి. బీహార్‌లో 222.8 మిలియన్ టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. బంగారు నిల్వలు విషయంలో బీహార్ తర్వాత కర్ణాటక ఉంది. ఇక్కడ 103 మిలియన్ టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌లో 3 శాతం బంగారం నిల్వలు, ఆంధ్రప్రదేశ్‌లో 3 శాతం, జార్ఖండ్‌లో 2 శాతం బంగారం నిల్వలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: