గుడ్ న్యూస్ : దిగొచ్చిన బంగారం, వెండి ధరలు

Vimalatha
పసిడి, వెండి భారీగా పతనమయ్యాయి. నిజానికి ఇప్పుడు బంగారం కొనాలనుకునే వారు కొనేయడం మంచిది అంటున్నారు విశ్లేషకులు. వారం రోజుల నుంచి రోజూ ఎంతో కొంత తగ్గుతూ వస్తోంది బంగారం. కానీ వెండి ధరలో మాత్రం హెచ్చు తగ్గులు కన్పించాయి. నిజానికి ఇది కొనుగోలుదారులకు గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఈ నెలాఖరులోగా బంగారం ధర భారీగా పెరిగిపోతుందేమోనని కంగారు పడుతున్న పసిడి ప్రియులకు ప్రస్తుతం ధర తగ్గుతూ రావడం సంతోషించాల్సిన విషయం. కేజీ వెండి ధర ఏకంగా రూ.1,500 తగ్గింది. భారీగా పతనమైన కేజీ వెండి ధర ఈ రోజు రూ. 70,200 దగ్గరకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతాయి. కానీ దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రూ.65,000 కు చేరుకుంది. ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.750 తగ్గి రూ.43,850కు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.820 తగ్గి రూ. 47,840 కి చేరింది.
హైదరాబాద్ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,850
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,840
ఢిల్లీ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,000
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,180
 
విజయవాడ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,850
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,840
వైజాగ్ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,850
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,840
బెంగళూరు:  
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,850
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,840
ముంబై :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,700
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700
 
చెన్నై :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,400
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,440

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: