మహిళలకు షాక్... పెరిగిన బంగారం !

Vimalatha
నిన్న తగ్గి కాస్త ఊరటనిచ్చింది పసిడి నేడు మాత్రం స్వల్పంగా పెరిగి మహిళలకు షాక్ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా బంగారం ధర పెరుగుతూ వస్తోంది. నిన్నటితో పోల్చితే నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.160 పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 పెరిగింది. ఈరోజు బంగారం ధరల విషయానికొస్తే...
హైదరాబాద్ : 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,880, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,800,
ఢిల్లీ : 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,200, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,950,
బెంగుళూరు : 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,880, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,800,
ముంబై : 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,890, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,890,
చెన్నై : 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,320, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,210.
వెండి కూడా బంగారం బాటలోనే నడవడంతో రూ.600 పెరిగింది. నిన్న రూ.73,800గా ఉన్న కేజీ వెండి 600 పెరగడంతో నేడు కేజీ వెండి ధర రూ.74,440 వద్ద ఉంది. హైదరాబాద్ లో కేజీ వెండి ధర రూ.74,400 ఉండగా... ఢిల్లీ, బెంగుళూరు, చెన్నై, ముంబైలలో వరుసగా రూ.69,400, రూ.69,400, రూ.74,400, రూ.69,400గా ఉంది. ఇక బంగారం ధరకైతే రెక్కలొచ్చేస్తున్నాయి. ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,200గా నమోదైంది. ఇక వెండి కేజీ ధర రూ.74,400గా ఉంది. రానున్న రోజుల్లో మరింతగా పెరిగిన ఆశ్చర్యపోనక్కర్లేదు. దీంతో పుత్తడి పరుగులను చూస్తే సామాన్యులకు దడ మొదలవుతోంది. పసిడి స్పీడ్ కు ఎప్పుడు బ్రేక్ పడుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: