షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. !
ఇక అంత ర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో బుధవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.220 పైకి కదిలింది. రూ.48,220కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.200 పెరుగుదలతో రూ.44,200కు ఎగసింది.బంగారం ధరలు పెరిగితే.. వెండి కూడా అదే దారిలో నడిచింది. వెండి ధర రూ. వెండి ధర కేజీకి రూ.1800 పెరుగుదలతో రూ.75,300కు చేరింది.. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీ దారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పాలి..
అంతర్జాతీయ మార్కెట్ లో నేటి ధరలను చూస్తే.. బంగారం ధర ఔన్స్‌కు 0.47 శాతం పెరుగుదలతో 1777 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 2.22 శాతం పెరుగుదలతో 26.46 డాలర్లకు ఎగసింది. బంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు.. ముఖ్యంగా మార్కెట్ లో బంగారం కొరత పెరగడం, లేదా ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్ వంటి పలు అంశాలు బంగారం ధరల పై ప్రభావం చూపిస్తున్నాయి.. ఇది నిజంగానే మహిళలకు బ్యాడ్ టైం.. ఈరోజు నీరుకార్చిన ధరలు రేపు ఎలా ఉంటాయో చూడాలి...