గుడ్ న్యూస్..బంగారం ధరలకు బ్రేకులు..వెండి జిగేల్..!

Satvika
పసిడి ప్రియులకు ఇది నిజంగానే తియ్యటి శుభవార్త అనే చెప్పాలి.. నిన్నటి దాకా పైకి కదిలిన బంగారం ధరలు ఈరోజు మాత్రం భారీగా తగ్గింది.. బంగారం ధర పెరుగుదలకు బ్రేక్ పడింది. పరుగులు పెడుతూ వచ్చిన బంగారం ధర ఈరోజు పడిపోయింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే విషయం.. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర తగ్గింది. బంగారం కొనాలని భావించేవారికి ఈరోజు కలిసి వస్తుంది..


హైదరాబాద్ మార్కెట్ లో శనివారం బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 330 తగ్గుదల తో రూ. 48,870కు క్షీణించింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.300 క్షీణత తో రూ. 44,800కు పడిపోయింది. ఇకపోతే గత కొన్ని రోజులుగా బంగారం ధరల పైనే వెండి ధర ఆధారపడి వుంది.. ఇటు పెరిగితే .. వెండి కూడా పెరిగెది.. నేటి మార్కెట్లో మాత్రం అందుకు భిన్నంగా వెండి ధర నమోదు అయ్యింది..


వెండి ధర కేజీకి రూ.400 పెరుగుదల తో రూ.74,300కు ఎగసింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.. అంతర్జాతీయ మార్కెట్ ‌లో కూడా బంగారం ధర తగ్గింది. బంగారం ధర ఔన్స్‌కు 0.29 శాతం తగ్గుదల తో 1776 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర పడిపోతే వెండి రేటు కూడా దిగొచ్చింది. ఔన్స్‌కు 0.54 శాతం తగ్గుదల తో 26.03 డాలర్లకు క్షీణించింది. ఏది ఏమైనా కూడా తగ్గింది అనే మాట వింటే ఆడవాళ్ళు కొనుగోలు చేయడం లో అస్సలు వెనకడుగు వెయ్యరు.. ఈరోజు కూడా అదే పరిస్థితి నెలకొంది.. రేపు ధరల్లొ ఎలాంటి మార్పులు కనిపిస్తుందొ చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: