జిగేల్ మన్న బంగారం,వెండి ధరలు..!!

Satvika
బంగారం కొనుగోలు చేసేవారికి ఇది బ్యాడ్ టైమ్ అనే చెప్పాలి..నిన్నటి వరకు కిందకు దిగివచ్చిన బంగారం ధరలు.. పసిడి రేటు పరుగులు పెట్టింది. బంగారం ధర దూసుకెళ్లింది. బంగారం ధర పెరిగితే వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. వెండి రేటు భారీగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరగడం వల్ల దేశీ మార్కెట్‌లోనూ అదే ట్రెండ్ కొనసాగిందని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. నిన్న కాస్త తగ్గిన ధరలు ఈరోజు పైకి కదలడం జరిగింది. అయిన మహిళలు మాత్రం బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు.

దేశీయ మార్కెట్ లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఇక హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర పరుగులు పెట్టింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.600 పైకి చేరింది. దీంతో రేటు రూ.45,440కు ఎగసింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.550 పెరుగుదలతో రూ.41,650కు చేరింది. బంగారం ధరలు పెరిగితే.. వెండి కూడా అదే దారిలో నడిచింది.

ఈరోజు వెండి ధర ఏకంగా రూ.1400 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.68,700కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.87 శాతం పెరుగుదల తో 1730 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 2.03 శాతం పెరుగుదలతో 25.03 డాలర్ల కు ఎగసింది. బంగారం ధరలు పెరగడం తగ్గడం పై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. మరి రేపటికి బంగారం ధరలు ఈ ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: