పసిడి ప్రియులకు శుభవార్త.. దిగొచ్చిన ధరలు..!!
వెండి ధరలు కూడా బంగారం ధరలతో పాటుగా నడిచాయి.హైదరాబాద్ లో బంగారం ధరలు కిందికి దిగివచ్చాయి. శుక్రవారం బంగారం ధరలు గురువారం ప్రారంభ ధరల కంటె కొద్దిగా తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 450 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 45,750 రూపాయలుగా నమోదు అయింది. ఇకపోతే 24 క్యారెట్ల బంగారం కూడా 49 వేలరూపాయల మార్క్ వద్దకు దిగొచ్చింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం 500 రూపాయల తగ్గుదల నమోదు చేసి 49,900 రూపాయలుగా నమోదైంది.
బంగారం ధరలు పడిపోతే.. వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి.కేజీ వెండి ధర గురువారం నాటి ప్రారంభ ధరకంటె 400 రూపాయలు పెరిగింది. దీంతో 70 వేల రూపాయల స్థాయికి వెండి ధరలు పెరిగాయి. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును.. విశాఖపట్టణం, విజయవాడ, ఢిల్లీ లలో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.95 శాతం పెరుగుదలతో 1873 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 1.18 శాతం పెరుగుదలతో 26.63 డాలర్లకు చేరింది.. మొత్తానికి రేట్లు ఓ మాదిరిగా తగ్గడంతో బంగారం కొనుగోలు పెరిగాయి.