భారీగా పెరిగిన బంగారం ధరలు.. జిగేల్ మన్న వెండి..!!

Satvika
బంగారం ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. ఈరోజు మార్కెట్ ఈ ధరలు షాక్ ఇస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్ మార్కెట్ లో ధరలు భారీగా పైకి కదిలాయి. గతంలో కొద్ది రోజులు ఊరట కలిగించిన ఈ బంగారం ధరలు ఈరోజు మాత్రం షాక్ ఇస్తున్నాయి.  గత వారం రోజులుగా ధరలు పైపైకి కదులుతున్నాయి. నిన్న కాస్త పెరిగిన సంగతి తెలిసిందే.. ఈరోజు మాత్రం కొనుగోలు దారుల ఊహకు అందని విధంగా ధరలు వినిపిస్తున్నాయి. మార్కెట్ లో రేట్లు పెరగడంతో బంగారం దుకాణాలు వెల వెల పోతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు కాస్త ఊరట కలిగిస్తున్నాయి. కానీ హైదరబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు షాక్ ఇస్తున్నాయి.. ఇక బంగారం విషయానికొస్తే.. 22 గ్రాముల బంగారం ధర రూ.46,400 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 50 వేల మార్క్ దాటి రూ.50,600గా ఉంది. విజయవాడ, విశాఖ నగరాల్లోనూ పసిడి ధరలు ఇలాగే ఉన్నాయి. మరో వైపు వెండి ధర సైతం మరింతగా పెరిగింది. దేశం లో కిలో వెండి ధర నిన్న రూ.64,415 ఉండగా.. రూ. 1450 పెరిగి రూ.65,600కు పెరిగింది.

దేశీయ మార్కెట్ లో బంగారం , వెండి ధరలు భారీగా పెరిగినట్లు తెలుస్తుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ మార్కెట్ల లో కిలో వెండి ధర రూ.68900గా ఉంది. గత వారం రోజుల్లో ఒక్కసారి మాత్రమే తగ్గిన బంగారం ధర.. ఆరుసార్లు పెరగడం గమనార్హం. ఈ వారం లోనే పది గ్రాముల బంగారం ధర రూ.660 పెరిగింది. పసిడి ధర ల పైనే వెండి కూడా ఆధారపడి ఉంటుంది. ఈరోజు పెరిగినంత ధర మున్పెన్నడు పెరగలేదు. బంగారం వెండి వస్తువుల కొనుగోలు పెరగడంతో వాటికి డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంది.. దీంతో రేట్లు పైకి కదులుతున్నాయని అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: