పసిడి ప్రియులకు మరో శుభవార్త.. భారీగా తగ్గిన ధర..!!
బంగారం ధరల పైనే వెండి ధరలు కూడా ఆధారపడుతుంది.. మొన్నటి దాకా వెండి కూడా భారీగా పలికిన సంగతి తెలిసిందే.. అయితే రెండు రోజులు కాస్త ఊరట నిచ్చిన ధరలు ఈరోజు పెరిగాయి. హైదరాబాద్ లో ప్రస్తుతం శనివారం రోజు బంగారం ధరలు చూస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.180 దిగొచ్చింది. రూ.49,580కి క్షీణించింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.160 తగ్గుదలతో రూ.45,450కు దిగొచ్చింది..
బంగారం ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.100 తగ్గింది. దీంతో వెండి ధర రూ.64,700కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పూర్తిగా తగ్గడంతో వెండి కొనుగోలు కూడా పూర్తిగా తగ్గిపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పడి పోయింది. 1800 డాలర్ల కిందకు వచ్చేసింది. బంగారం ధర ఔన్స్‌కు 1.24 శాతం తగ్గుదలతో 1783 డాలర్లకు పడి పోయింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర ఔన్స్‌కు 2.92 శాతం తగ్గుదలతో 22.68 డాలర్లకు తగ్గిపోయింది.. రోజుకో విధంగా బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. అయితే ఇప్పుడు ఉపశమనం కలిస్తే ఇంక రేపటితో రేట్లు ఎలా ఉంటాయో చూడాలి..