గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం ధరలు..!!
విదేశీ మార్కెట్ లో రేట్లు పూర్తిగా తగ్గిపోవడంతో ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్ లో కూడా రేట్లు భారీగా తగ్గాయి. బుధవారం బంగారం ధర పడిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.980 క్షీణించింది. రూ.50,400కు తగ్గింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.900 తగ్గుదలతో రూ.46,200కు క్షీణించింది.. అదే దారిలో వెండి కూడా నడిచింది. బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో వెండి రేట్లు కూడా పూర్తిగా తగ్గిపోయింది..
ఈరోజు హైదరాబాద్ మార్కెట్ లో వెండి ధరలు కిందకు దిగి వస్తున్నాయి. ఏకంగా .2,200 దిగొచ్చింది. దీంతో వెండి ధర రూ.64,500కు పడిపోయింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం వెండి ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.07 శాతం పెరుగుదలతో 1805 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం తగ్గింది. వెండి ధర ఔన్స్‌కు 0.08 శాతం తగ్గడంతో ఇప్పుడు వెండి 23.28 కు తగ్గింది. పండుగకు పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు..