పసిడి ప్రియులకు మరో భారీ షాక్.. దూసుకెళ్తున్న వెండి..
హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరలు ఈరోజు భారీగా పెరిగాయి...బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.830 పెరుగుదలతో రూ.52,380కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.770 పైకి కదిలింది. దీంతో ధర రూ.48,020కు ఒక్కసారిగా పెరిగింది..
గత ఐదు రోజుల నుంచి బంగారం, వెండి ధరలు సామాన్యుడికి అందుబాటులో లేవని చెప్పాలి.. భారీగా పెరుగుతున్నాయి.. గత కొద్ది రోజులు మాత్రం ఎగిసిపడుతున్నాయి..బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. గత 5 రోజుల్లో కేజీ వెండి ధర రూ.690 పైకి కదిలింది. దీంతో వెండి ధర రూ.65,410కు చేరింది. పరిశ్రమలలో నాణేల, వస్తువుల తయారీ మళ్లీ పుంజుకోవడంతో రేట్లు ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నాయి.. అంతర్జాతీయ మార్కెట్లో ఈరోజు బంగారం ధర పైకి కదిలింది. బంగారం ధర ఔన్స్‌కు 0.23 శాతం పెరుగుదలతో 1956 డాలర్లకు ఎగసింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది.వెండి ధర ఔన్స్‌కు 0.94 పెరుగుదలతో 25.90 డాలర్లకు భారీగా పెరిగింది..మరి ఈ వారంతరం రేట్లు ఎలా ఉంటాయో చూడాలి..