మళ్ళి భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు..!

Suma Kallamadi
పసిడి ధర మళ్ళి పరుగులు తీసింది.బంగారం ధర బాటలోనే వెండి కూాడా నడిచి భారీగా పెరిగింది. జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరగగా అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం పసిడి, వెండి ధరలు కొంత తగ్గాయి. మళ్ళి నేడు జాతీయ మార్కెట్లో బంగారం ధర జిగేల్ మంది. పసిడి మెరివగా వెండి కూడా దాని బాటలో పైకి దూకింది. నిన్న భారీగా పడిపోయిన బంగారం ధర నేడు మాత్రం బాగా పెరిగింది. గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధర తగ్గినా కూడా దేశీ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర పరుగులు పెట్టడం ఏంటా అంటున్నారు మార్కెట్ నిపుణులు.  వెండి ధర కూడా పైకి దూసుకెళ్లింది. ఇటు బంగారం ధరతో బాటు నేడు వెండి కూడా బాగా పెరిగింది.
హైదరాబాద్ మార్కెట్‌లో నేడు మంగళవారం నాడు పసిడి ధర బాగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి  ధర రూ.680 పెరగటంతో పసిడి ధర రూ.51,730కు చేరింది. ఇదే సమయంలో 22 క్యారెట్ల పసిడి ధర కూడా 10 గ్రాములకు రూ.280 పెరిగి పసిడి ధర రూ.47,090కు చేరింది. పసిడి ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే బాటలో పయనించి పైకి కదిలింది. కిలో వెండి ధర  రూ.1,050 భారీగా పెరగటంతో వెండి ధర రూ.62,750కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి ఫుల్ డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ముఖ్య కారణంగా చెప్పుకోస్తున్నారు మార్కెట్ నిపుణులు.
ఇది ఇలా ఉంటే మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం పసిడి ధర దిగొచ్చింది. బంగారం ధర ఔన్స్‌కు 0.26 శాతం తగ్గటంతో 1906 డాలర్లకు క్షీణించగా, బంగారం ధర  బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.44 శాతం తగ్గటంతో 24.59 డాలర్లకు క్షీణించింది. మార్కెట్లో పసిడి ధరపై ప్రభావం చూపే అంశాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా గ్లోబల్ మార్కెట్లో పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, భౌగోళిక ఉద్రిక్తతలు, జువెలరీ మార్కెట్, వాణిజ్య యుద్ధాలు వంటి అనేక  అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతుంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: