నేటి పసిడి, వెండి ధరలు ఇలా..!

Suma Kallamadi
నేడు బంగారం ధరలు కాస్త స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. నేటి ఉదయం మార్కెట్ లో భాగంగా దేశీయ ఫ్యూచర్ మార్కెట్ లో మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో డిసెంబర్ నెలకు సంబంధించి బంగారం ఫీచర్స్ లో 10 గ్రాముల బంగారం ధర తగ్గు ముఖం పట్టింది. గోల్డ్ ఫ్యూచర్స్ లో రూ. 50 ,631 చేరగా వెండి కిలో ఫీచర్స్ లో రూ. 61 ,660 కి పెరిగింది. గత రెండు వారాల నుంచి బంగారం ధరలు కాస్త హెచ్చుతగ్గులకు లోనవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం కొనసాగుతున్న ధర ఆల్ టైం గరిష్టానికి ఏకంగా 5,500 రూపాయలు తక్కువగా ఉంది.
ఇక నేడు అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఒక ఔన్స్ కు 0.05 శాతం పెరిగి 1909 .85 డాలర్లకు చేరుకుంది.  రోజు అంతర్జాతీయ మార్కెట్లో 1908 .9 డాలర్ల వద్ద ముగిసిన బంగారం నేడు 1990 .8 డాలర్ల వద్ద ప్రారంభమైంది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఆల్టైమ్ గరిష్టం కంటే ప్రస్తుతం 75 డాలర్లకు బంగారం ధర దిగివచ్చింది. అలాగే అంతర్జాతీయంగా వెండి ధరలు 30 డాలర్లు తగ్గింది.

ఇక నేడు భారతదేశంలో బంగారం ధర విషయానికి వస్తే.. నేడు బంగారం ధరలు కాస్త స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఇక మన తెలుగు రాష్ట్రాలలో స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 52 ,740 పలకగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48 ,310 కి చేరుకుంది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 53 ,700కు చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49 ,250 కి చేరుకుంది. ఇక సమాచార అందిన సమయానికి హైదరాబాద్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర 190 పెరిగి 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52, 940 కి చేరుకుంది. అలాగే కేజీ వెండి ధర 600 రూపాయలు పెరిగి రూ. 61 ,600 కు చేరుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: