భారీగా తగ్గిన వెండి, పసిడి ధరలు..!

Suma Kallamadi
గత వారం రోజుల క్రితం బాగా తగ్గిన బంగారం ధరలు మళ్లీ మూడు రోజుల వరకు పెరుగుదల బాట పట్టాయి. కాకపోతే మళ్లీ అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారు ధరలు కాస్త తగ్గుముఖం పడుతూ ఉన్నట్లు కనబడుతున్నాయి. రెండు, మూడు రోజుల క్రితం పెరిగిన బంగారం ధరలతో 10 గ్రాముల బంగారం ధర 51000 మార్కు దాటిన విషయం అందరికీ విదితమే. కాకపోతే తాజాగా ఫ్యూచర్ మార్కెట్ లో బంగారం విలువ భారీగా క్షీణించింది. ఇకపోతే మల్టీ కమిటీ ఎక్స్చేంజ్ లో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 852 రూపాయలు తగ్గు ముఖం పట్టింది. ఇది ఈ సంవత్సరం వెళ్లిన గరిష్ఠ ధరకు ఏకంగా ఆరు వేల రూపాయలు తక్కువ.

తాజాగా ఫ్యూచర్స్ లో బంగారం ద్వారా 51 వేల పైగా గరిష్టం, కనిష్టంగా 50100 పలికింది. గత రెండు మూడు రోజులు ఎంత భారీగా పెరిగిందో అంతే ఒక్కరోజులోనే పూర్తిగా క్షీణించింది. ఇలాంటి పరిస్థితులు బులియన్ మార్కెట్లో సహజమేనని బులియన్ మార్కెట్ నిపుణులు తెలుపుతున్నారు. అయితే బంగారం ధర పెరిగితే ఇటు కొనడానికి బంగారు ప్రియులు అలాగే అమ్ముకోవడానికి బాగా వీలు ఉంటుందని రిటైల్ అమ్మకం దారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఫీచర్స్ లో బంగారం లాగానే వెండి ధర కూడా 2500 రూపాయలు క్షీణించింది.

తాజాగా హైదరాబాదులో బంగారం ధర విషయానికి వస్తే.. స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 320 రూపాయలు తగ్గి రూ 52,770 రూపాయలకు చేరుకుంది. ఇక అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర చూస్తే 270 రూపాయలు తగ్గి రూ 48, 380 కు చేరుకుంది. ఇక మరోవైపు వెండి ధర చూస్తే కేజీ వెండి ధర ఏకంగా ₹ 1500 భారీ పతనం చెందింది. దీంతో కేసు బంగారం ధర రూ 60, 900 కు చేరుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: