భారీగా పెరిగిన పసిడి ధరలు.. వెండి కూడా అదే దారిలో..!
బంగారం కొనుగోలు చేయాలని అనుకునేవారికి ఇది చేదు వార్త అనే చెప్పాలి. పసిడి ధర రోజురోజుకు పైపైకి ఎగబాకుతుంది. అయితే బులియన్ మార్కెట్లో నేడు బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు రెండు రోజుల వ్యవధిలో దాదాపు రూ.6 వేల వరకు పెరిగాయి. వెండి ధరలు మాత్రం ఊహించనంతగా ఎగసి, ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి.
తాజాగా హైదరాబాద్, విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.830 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.52,200 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం రూ.760 పెరగడంతో 10 గ్రాముల ధర రూ.47,850 వద్ద ట్రేడ్ అవుతోంది.తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ మార్కెట్లోనూ బంగారం ధరలు భారీగా పెరిగాయి. నేటి మార్కెట్లో రూ.850 పెరుగుదలతో మార్కెట్ ప్రారంభమైంది.
అంతేకాకుండా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.49,950కి చేరువైంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,750కి ఎగబాకింది. శుక్రవారం వెండి ధర రూ.3,550 మేర భారీగా పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్ చరిత్రలోనే వెండి ఆల్‌టైమ్ గరిష్ట ధరల్ని నమోదు చేసింది. తాజాగా 1 కేజీ వెండి ధర ధర రూ.58,950 కి పెరిగింది. మార్కెట్లో ఇప్పటివరకూ అత్యధిక ధర ఇదే. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధరలో ట్రేడ్ అవుతోందని నిపుణులు తెలుపుతున్నారు.
అయితే అంతర్జాతీయంగానూ పసిడి ధరలు భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం బంగారం ధర ఔన్స్‌కు 1890 డాలర్ల సమీపంలో కదలాడుతూ వస్తోంది. ఇది 9 ఏళ్ల గరిష్ట స్థాయి. వెండి కూడా ఔన్స్‌కు 22 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక మన దేశంలో బంగారం ధర ప్రస్తుతం రూ.52 వేల సమీపంలో కదలాడుతోంది. వెండి ధర కేజీకి ఏకంగా రూ.62 వేల్లకు పరుగులు పెట్టిందని నిపుణులు తెలిపారు.
.