బంగారం: బాబోయ్.. 10వేలు పెరిగిన బంగారం ధర!?

Durga Writes

బంగారం 10 వేలు పెరిగింది అనే ముందు ఈరోజు ధరలు చూద్దాం. నేడు మంగళవారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 270 రూపాయిల పెరుగుదలతో 44,700 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 270 రూపాయిల పెరుగుదలతో 41,000 రూపాయలకు చేరింది. 

 

బంగారం ధరలు భారీగా పెరగగా.. వెండి ధర కూడా భారీగా పెరిగింది. దీంతో నేడు కేజీ వెండి ధర 500 రూపాయిల పెరుగుదలతో 51,500 రూపాయిలకు చేరింది. దీనికి కారణంగా అంతర్జాతీయంగా బంగారం, వెండి కొనుగోలుదారుల నుండి డిమాండ్ భారీగా పెరగటమే అని.. మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇలా బంగారం ధరలు ఇప్పుడు 41 వెయ్యి దగ్గరకు చేరాయి. 

 

గత సంవత్సరం సరిగ్గా ఈరోజు బంగారం ధరలు ఎంత ఉన్నాయో మీకు గుర్తు ఉందా? సరిగ్గా 31 వెయ్యి 200 రూపాయిలు ఉండేది. అలాంటి ఈ బంగారం ధర ఇప్పుడు ఏకంగా 41 వెయ్యి వద్దకు వచ్చింది. అంటే సంవత్సరం సమయంలో 10 వేలు పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధర కేవలం ఒక్క సంవత్సరంకు 10 వేలు పెరిగింది. బంగారం ధరలు ఇలాగే పెరిగితే చూసేవాళ్ళు పెరుగుతారు.. కొనేవాళ్ళు తగ్గుతారు. అయినా ఈ కాలంలో బంగారం కంటే గిల్టు నగలే అందంగా ఉంటున్నాయి అని అంటున్నారు కొందరు మహిళలు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: