బంగారు కొంటున్నారా ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే నష్టమే?

VAMSI
బంగారు ప్రియులకు ముఖ్యమైన వార్త... ఇక మీరు కొనబోయే బంగారు ఆభరణాలు ఏ క్యారట్ బంగారు అయినా వాటిపై హాల్మర్క్ ముద్ర ఉండాల్సిందే అన్నది తాజా వార్త. జూన్ 1 నుంచి క్యారెట్లతో సంబంధం లేకుండా అన్ని బంగారం ఆభరణాలపై తప్పని సరిగా హాల్‌మార్క్‌డ్ చేసిన తర్వాతనే వర్తకులు విక్రయించాలని ఆదేశాలు జారీ చేయబడ్డాయి. ఈ మేరకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్ట్స్ గత నెలలో నోటిఫికేషన్ జారీ చేసిన విషయం అందరికి తెలిసి ఉండకపోవచ్చు. కాగా ఇపుడు ఆ డేట్ దగ్గరపడటం తో మరో సారి ఈ న్యూస్ హైలెట్ అయ్యింది.
జూన్ 1 నుంచి బీఐఎస్‌ హాల్ మార్కింగ్ లేకుండా వ్యాపారులు ఏ బంగారం ఆభరణాన్ని విక్రయించడానికి అనుమతి లేదు. ఏ వ్యక్తి అయినా సరే ముందుగా బంగారానికి బీఐఎస్ హాల్‌మార్కింగ్ సెంటర్ నుండి హాల్‌ మార్కింగ్ చేసిన తర్వాతనే ఆభరణాలు విక్రయించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇది కనుక అతిక్రమిస్తే చర్యలు తీసుకునే  అవకాశం ఉంది. కొనుగోలుదారులు సైతం ఈ విషయంపై అవగాహన కలిగి ఉండటం అవసరం. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే ముందు హాల్మార్క్  ఉందో లేదో చెక్ చేసుకోండి. బంగారు నగలకు హాల్ మార్కింగ్ చేయడం వలన కస్టమర్లలో బంగారు ఆభరణాల క్వాలిటీ పట్ల విశ్వాసం పెరుగుతుంది.
ఇది నిజంగా బంగారం కొనుగోలు చేసే వారికి పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే దీని వల్ల బంగారం కొనుగోలుదారులకు గొప్ప ప్రయోజనం కలుగుతుంది. ఈ ముద్ర వలన బంగారం ఎంత స్వచ్ఛతతో కలిగి ఉంది అన్నది కచ్చితంగా తెలుస్తుంది. అలాగే బంగారం విలువకు సమానమైన మొత్తాన్ని ఎటువంటి మోసం , అనుమానం లేకుండా చెల్లించొచ్చు . కాబట్టి మీరు కొనబోయే బంగారం విషయంలో జాగ్రత్త పడకపోతే మీకు నష్టం జరిగే అవకాశం లేకపోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: