బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్..?

Suma Kallamadi
కరోనా సమయంలో భారతదేశంలోని అన్ని వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇక గత కొద్ది నెలలుగా బంగారం, వెండి ధరల్లో కూడా భారీ పెరుగుదల కనిపించడం లేదు. వాస్తవానికి బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గుతున్నాయి. తాజాగా కూడా పసిడి రేటు బాగా పడిపోయింది. మరోపక్క వెండి కూడా బంగారం ధర లాగానే విపరీతంగా రేట్ కోల్పోయింది. అయితే ఈ రోజు పసిడి, వెండి రేట్లు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.
శనివారం రోజు హైదరాబాద్ మార్కెట్‌లో పడిపోయిన పసిడి రేట్ గురించి తెలుసుకుంటే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 760 రూపాయలు తగ్గింది. దీనితో హైదరాబాద్ మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర 49,640 రూపాయలకు పడిపోయింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర కూడా దాదాపు అంతే స్థాయిలో తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధరపై 700 రూపాయలు తగ్గడంతో.. ప్రస్తుతం 10 గ్రాముల ధర 45,500 రూపాయలకు క్షీణించింది.
ఇక శనివారం రోజు వెండి ధర కూడా బాగా తగ్గింది. నిజానికి బంగారం తగ్గుదలతో పోలిస్తే వెండి తగ్గుదల ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శనివారం రోజు కేజీ వెండి ధర పై 2000 తగ్గింది. ఫలితంగా ప్రస్తుతం కేజీ వెండి ధర 75,500 రూపాయలకు క్షీణించింది. అయితే వెండి ధర రెండు వేల రూపాయల పతనం కావడంతో.. వెండి పట్టీలు, కడియాలు, ఆభరణాలు, తదితర వెండి సామాగ్రి కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఇది చాలా మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు.
భారతదేశంలోని బంగారం ధర పతనం అయినప్పటికీ.  అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం పసిడి ధర ఏకంగా 1.11 శాతం పైకి ఎగబాకింది. దీంతో ఔన్స్ బంగారం రేటు.. అనగా 28 గ్రాముల బంగారం రేటు 1894( సుమారు రూ.1 లక్షా 39,000) డాలర్లకు పెరిగిపోయింది. బంగారం తో పాటు వెండి రేటు కూడా అంతర్జాతీయ మార్కెట్లో భారీగా పెరిగింది. ఔన్స్‌కు 1.62 శాతం వెండి రేటు పెరగడంతో ప్రస్తుత ధర 27.92 డాలర్లకు ఎగబాకింది.
ఇకపోతే పసిడి రేట్ తగ్గాలన్నా పెరగాలన్నా అనేక అంశాలు కారణమవుతాయి.  ద్రవ్యోల్బణం లో మార్పులు వచ్చినా... అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరల్లో మార్పులు వచ్చినా.. భారత్ లో పసిడి ధర మారుతుంది. కేంద్ర బ్యాంకులలో గోల్డ్ స్టోరేజ్.. బంగారం వడ్డీ రేట్లతో పాటు బిజినెస్ వార్స్ తదితర అంశాల కారణంగా బంగారం ధర పై తీవ్ర ప్రభావం పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: