భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌లు..?

Suma Kallamadi
బంగారం అంటే మ‌హిళ‌ల‌కు ఎంతో మక్కువ‌. వాటిన ఒంటిమీద ధ‌రించి తెగ మురిసిపోతుంటారు. ఈ కాలంలో పురుషులు కూడా బంగారం వేసుకోవ‌డానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . అయితే గ‌త కొద్దికాలంగా బంగారం ఏ రేంజ్‌లో దూసుకుపోతుందో చూస్తూనే ఉన్నాం. క‌రోనా కాలంలో కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి ధ‌ర‌లు. ఇప్పుడు కూడా విప‌రీతంగా మ‌రోసారి రేట్లు పెరిగాయి.
నిన్నటి వ‌ర‌కు కాస్త నిలకడగా సాగిన బంగారం ధరలు కొంత ఊర‌టనిచ్చాయ‌నుకునేలోపే ఈ రోజు బాంబు పేల్చాయి. ఈరోజు మాత్రం ఏకంగా పసిడి రేటు భార‌గా పెరిగింద‌ని చెప్పాలి. బంగారం ధర పైకి కదిలితే.. ఇక అదే దారిలో వెండి రేటు కూడా పెర‌గ‌డం భారీ షాక్ అనే చెప్పాలి. బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు.
తెలంగాణ‌లోని హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 పైకి పెర‌గ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. దీంతో బంగారం రేటు రూ.50,400కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో సాగుతోంది. రూ.100 పెరుగుదలతో రూ.46,200కు ఎగసింది.
ఇక ఇదే దారిలో వెండి కూడా షాక్ ఇచ్చింది ప్ర‌జ‌ల‌కు. బంగారం ధర పెరిగితే.. వెండి రేటు రూ.900 పైగా పెరిగింది ఈ ఒక్క‌రోజే. దీంతో కేజీ వెండి ధర రూ.77,500కు చేరింద‌ని దుకాణా దారులు వెల్ల‌డించారు. దీంతో వెండి కొనాల‌నుకునే వారికి కాస్త భారం అనే చెప్పాలి. ఇదిలా ఉంటే ఇంకోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర తగ్గడం విశేషం. 0.10 శాతం అంద‌ర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధ‌ర త‌గ్గింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1871 డాలర్లకు దిగొచ్చింది. వెండి రేటు మాత్రం పైపైకి కదిలింది. ఔన్స్‌కు 0.18 శాతం పెరుగుదలతో 27.42 డాలర్లకు ఎగసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: