స్వల్పంగా పెరిగిన పసిడి, వెండి ధరలు..!

Suma Kallamadi
బంగారం ధరలు  రోజురోజుకు పడిపోతున్న తరుణంలో.. ఎట్టకేలకు తగ్గుదలకు కొంత బ్రేకులు పడ్డాయి. గత 3 రోజులు నుండి బంగారం ధర పడిపోతూ వచ్చిన సంగతి తెలిసిందే. కానీ తిరిగి ఒక్క రోజులోనే బంగారం ధర పైకి లేచింది. బంగారం ధర తగ్గుదలకు అడ్డుకట్టపడింది ఈరోజు. నేడు పసిడి ధర పరుగులు తీశాయి. గడిచిన గత మూడు రోజులుగా రోజురోజుకు పడిపోతూ వచ్చిన బంగారం ధర ఈరోజు మాత్రం పైకి ఎగిసింది. బంగారం ధరతో పాటు వెండి ధర కూడా పైకి కదిలింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర దిగివచ్చినా కూడా దేశీ మార్కెట్‌లో పసిడి పైకి చేరటం గమనార్హం అంటున్నారు.
హైదరాబాద్ మార్కెట్‌ లో శనివారం నాడు  బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.190 పెరగటంతో  రూ.52,940కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.180 పైకి పెరిగింది.దీంతో ధర రూ.48,530కు ఎగసింది. కాగా బంగారం ధర గత మూడు రోజుల్లో రూ.560 కి పడిపోయింది. బంగారం ధర పెరగటంతో  వెండి ధర కూడా అదే బాటలో నడిచింది. కేజీ వెండి ధర రూ.600 పైకి చేరింది. దీంతో వెండి ధర రూ.61,600కు ఎగసింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి మంచి డిమాండ్ పుంజుకోవడం కూడా ఇందుకుగల ప్రధాన కారణంగా చెప్పచు. కాగా వెండి ధర గత మూడు రోజుల్లో రూ.2,800 పతనం అయింది.
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర బాగా దిగొచ్చింది. బంగారం ధర ఔన్స్‌కు 0.32 శాతం పడిపోటంతో 1902 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గడంతో  వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌ కు 0.25 శాతం పెరుగుదలతో 24.28 డాలర్లకు ఎగసింది.  బంగారం ధరలు పై ప్రభావం చూపే అంశాలు అనేకం ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్లో  పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల దగ్గర ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై చాలా ప్రభావం చూపుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: