మరింత తగ్గిన పసిడి, వెండి ధరలు...!

Suma Kallamadi
తాజాగా పసిడి వెండి ధరలు మరోమారు క్షీణించాయి. దేశి ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమ్యూనిటీ ఎక్స్చేంజ్ లో 10 గ్రాముల పసిడి ధర 0.25 శాతం నష్టపోయి రూ. 50 ,413 పలికింది. ఈ ధర ఆల్ టైం ధరతో పోలిస్తే ఏకంగా రూ. 5730 తక్కువ. బంగారం ధర తగ్గుదలతో పాటుగా వెండి ధర కూడా భారీగా పతనం అవుతోంది. వెండి ధర ఫీచర్స్ లో 0.7% నష్టపోయి రూ. 61,110 వద్ద ట్రేడ్ కొనసాగుతోంది.

ఇక అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు కొద్దిమేర క్షీణించాయి. ఔన్స్ బంగారం ధర 0.16 శాతం నష్టపోయి 1904 డాలర్లకు చేరుకుంది. ముందు రోజు మార్కెట్ ముగిసే సమయానికి 1907 డాలర్ల వద్ద ముగిసింది. అలాగే వెండి ఫీచర్స్ కూడా 0. 59 శాతం నష్టపోయి 24.24 డాలర్ల వద్ద కొనసాగుతోంది. క్రితం రోజు వెండి 24. 39 డాలర్ల వద్ద ముగిసింది. ఇక ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయి ఓసారి చూద్దామా..

10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 40 రూపాయలు తగ్గి రూ. 52 ,750 వద్ద కొనసాగుతుండగా... 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 10 రూపాయలు నష్టపోయి 48 ,350 వద్ద కొనసాగుతోంది. అలాగే వెండి ధర చూస్తే కేజీ నుండి రూ . 1000 వరకు తగ్గి రూ. 61000 వద్ద కొనసాగుతోంది. గత మూడు రోజుల క్రితం భారీగా పెరిగిన బంగారం ధర మళ్లీ తగ్గుముఖం పడుతుంది. బుధవారం నాడు బంగారం, వెండి ధరలు నేలచూపులు చూశాయి. కాబట్టి బంగారం కొనాలనుకునే వారికి ప్రస్తుతం చాలా మంచి అవకాశం. ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో భాగంగా డిమాండ్ ఎక్కువ లేక పోవడం కారణంగా మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు బులియన్ మార్కెట్ నిపుణులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: