స్థిరంగానే కొనసాగుతున్న బంగారు, వెండి ధరలు...!

Suma Kallamadi
నేటి బంగారం ధర నిన్నటి ధర తో పోలిస్తే కొద్ది మేర పెరిగాయి. తాజాగా మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఫ్యూచర్ మార్కెట్ లో రూ. 50, 458 పలికిన బంగారం ధర చివరికి రూ. 50 ,120 వద్ద ముగిసింది. నేడు గాంధీ జయంతి కారణంగా భారతదేశ మార్కెట్లు సెలవులో ఉన్నాయి. ఇకపోతే తాజాగా హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు విషయానికి వస్తే...

నేడు బంగారం విలువ నిన్నటి ధరలతో పోలిస్తే కాస్త స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే 10 గ్రాములు రూ. 52,650కు చేరుకోగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ 48,260 కి చేరుకుంది. ఇక మరోవైపు కేజీ వెండి ధర 500 రూపాయల వరకు పెరిగి రూ. 61, 200 వద్ద కొనసాగుతోంది.గత రెండు వారాల నుండి బంగారం ధరలు ప్రతి రోజు క్షీణిస్తూనే ఉన్నాయి. ఆల్ టైం హై ధరలతో పోలిస్తే ప్రస్తుతం బంగారం ఏకంగా 10 గ్రాముల బంగారం ధర కు 7000 రూపాయలు తగ్గింది.  

అలాగే వెండి విషయం చూస్తే కేజీ వెండి 12 నుంచి 14 వేల రూపాయల తగ్గింది. కాబట్టి ఎవరైనా బంగారం, వెండి కొనాలనుకునే వారికి ప్రస్తుతం మంచి అవకాశం. అయితే బులియన్ మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం డిసెంబర్ నెల చివరి నాటికి బంగారం విలువ అమాంతం పెరుగుతుందని తెలియజేశారు.ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర సెప్టెంబర్ నెలలో ఏకంగా 4.8 శాతం మేర తగ్గిపోయింది. ప్రస్తుతం అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ లో 1890 డాలర్ల కు చేరుకుంది. తాజాగా భారత దేశంలోని ముంబై లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే రూ.50,413 రూపాయలు పలకగా 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,178 గా పలికింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: