లేడీస్‌పై శివాజీ కామెంట్స్‌... ఈ టాలీవుడ్ లేడీస్ ఫైర్ మామూలుగా లేదే...!

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

నటుడు శివాజీ ఇటీవల ఒక సినిమా వేడుకలో హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. ‘దండోరా’ చిత్ర ఈవెంట్‌లో ఆయన మాట్లాడిన మాటలు మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. చివ‌ర‌కు ఈ విష‌యంలో శివాజీ వెన‌క్కు త‌గ్గి క్ష‌మాప‌ణ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఈ వివాదం ఇప్పుడు కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వరకు వెళ్ళింది. అయితే దీనిపై టాలీవుడ్ లో ప‌లువురు మ‌హిళ‌లు , నిర్మాత‌లు, హీరోయిన్లు అంద‌రూ ఘాటుగా స్పందించి మ‌రీ మాకు ఫిర్యాదు చేశారు.


 హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్ గురించి శివాజీ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని మహిళా సంఘాలు మరియు సినీ ప్రముఖులు భావిస్తున్నారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, సమాజంపై ప్రభావం చూపే నటుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని పలువురు ఫైర్ అయిపోయారు.  ఈ వ్యవహారంపై టాలీవుడ్‌లోని మహిళా శక్తి ఏకమైంది. ‘వాయిస్ ఆఫ్ ఉమెన్’ బృందం తరఫున ప్రముఖ సినీ ప్రముఖులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. దర్శకురాలు నందిని రెడ్డి, నిర్మాతలు సుప్రియ యార్లగడ్డ, స్వప్న దత్, నటీమణులు లక్ష్మీ మంచు, ఝాన్సీ తదితరులు ‘మా’ (MAA) అసోసియేషన్‌కు అధికారికంగా ఫిర్యాదు చేశారు.


ఆడవారి పట్ల ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సమాజానికి హానికరమని, దీనిని ఉపేక్షించకూడదని వారు పేర్కొన్నారు. శివాజీ తక్షణమే మహిళలందరికీ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఎట్ట‌కేల‌కు ఈ వివాదం ముద‌ర‌డంతో పాటు మ‌హిళ‌లు , అటు మ‌హిళా సంఘాల నుంచి తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు రావ‌డంతో శివాజీ దిగిరాక త‌ప్ప‌లేదు. క్ష‌మాప‌ణ చెప్ప‌డంతో పాటు త‌న వాఖ్య‌లు ఉప సింహారించుకున్న‌ట్టు వీడియో రిలీజ్ చేయాల్సి వ‌చ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: