స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈరోజు ధరలు ఇలా..!

Suma Kallamadi
గత కొన్ని రోజులుగా వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు నేడు పైకి ఎగబాకి షాక్ ఇచ్చాయి. నిన్నటి వరకు బంగారం కొనుగోలు చేసే వారికి  ఊరట లభించింది అనుకుంటే ఈరోజు పరిస్థితి తారుమారైంది అని చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్ తో పాటు దేశీయ మార్కెట్లో బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో స్థానిక మార్కెట్లలో కూడా బంగారం ధర ఒక్కసారిగా భగ్గుమన్నాయి.

హైదరాబాద్ నగరంలో నిన్నటి తో పోలిస్తే ఈ రోజుకి బంగారం ధర రూ. 500-600 పైచిలుకు పెరిగిపోయింది. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర చూసుకుంటే... 10 గ్రాముల 22 క్యారెట్ల ధర 560 రూపాయలు పెరిగి రూ. 49, 750 వద్ద నిలిచింది. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర 610 రూపాయలు పెరిగి రూ. 53, 660 వద్ద నిలిచింది.

విజయవాడ, విశాఖపట్నం జిల్లాల్లో కూడా హైదరాబాద్ నగరంలో లాగానే బంగారం ధర పెరిగిపోయింది. ఆగస్టు 28 వ తేదీన పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 560 పెరిగిపోవడంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో 49,750 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా విజయవాడ విశాఖపట్నం బంగారపు మార్కెట్లలో 24 క్యారెట్ల గోల్డ్ కూడా పది గ్రాములకు 610 పెరిగి 53,660 రూపాయల వద్ద నిలిచింది.

భారత రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు పైకి ఎగబాకాయి. నిన్నటి తో పోల్చుకుంటే ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 750 రూపాయలు పెరిగి రూ. 50,600 వద్ద నిలిచింది. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర అక్షరాల 820 రూపాయలు పెరిగి... 55,200 రూపాయల వద్ద నిలిచింది. పైన పేర్కొనబడిన బంగారపు ధరలు 2020 ఆగస్టు 28 ఉదయం ఎనిమిదింటి లోపు నమోదైనవిగా పాఠకులు గమనించగలరని మనవి. అంతర్జాతీయ జాతీయ స్థానిక మార్కెట్లలో బంగారం ధరల్లో రోజులో ఎప్పుడైనా హెచ్చుతగ్గులు ఉండొచ్చు. కొనుగోలు చేసేవారు ఈ విషయం కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా మనవి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: