గుడ్ న్యూస్: దిగివచ్చిన బంగారం ధర... ఈరోజు ధరలు ఇలా..!

Suma Kallamadi
ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర పన్నులు, ఛార్జీలు వసూలు వంటి అనేక అంశాల కారణంగా భారతదేశం అంతటా బంగారు ఆభరణాల ధరలు మారుతూ ఉంటాయి. బంగారం, వెండి ధరలు భారతదేశంలో ఒకేసారి తగ్గుతున్నాయి.. ఒకేసారి అమాంతం పెరిగుతున్నాయి. ఎంసిఎక్స్ ప్రకారం అక్టోబర్ లో బంగారం ధరలు ఒక గణనీయంగా తగ్గిపోతాయి అని తెలుస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 110 రూపాయలు తగ్గి ప్రస్తుతం రూ.51,560కు క్షీణించింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 120 రూపాయలు పడిపోవడంతో ప్రస్తుతం రూ.56,240కు క్షీణించింది. గత 24 గంటల్లో కిలో వెండి ధర వెండి ధర రూ.3000 తగ్గడంతో ప్రస్తుతం కేజీ ధర 68, 100 పలుకుతుంది. ఇక గతంలో చూసుకుంటే బంగారం ధర 10 గ్రాముల కి రూ. 1, 015 పెరిగిపోయింది. 10 గ్రాముల బంగారం ధర ఇండియాలో అత్యధికంగా 56, 191 రూపాయలు పలికింది. గ్లోబల్ మార్కెట్లో యు.ఎస్.డాలర్ విలువ పెరిగిపోతుండటంతో మన ఇండియాలో బంగారం ధర ఒక్కసారిగా తగ్గిపోతుంది.

ఇకపోతే పసిడి ధరలు పడిపోవడంతో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం అని తెలుస్తోంది. మరోవైపు బంగారం ధర 3.5% తగ్గిపోతుందని ఎంసీఎక్స్ వెల్లడించింది. చెన్నై నగరంలో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ.50, 840. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 55, 460. ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర, ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధరలు భారత దేశ వ్యాప్తంగా ఎలా ఉన్నాయో చూద్దాం.

చెన్నై లో 22 క్యారెట్స్ ధర రూ.50,840 ఉండగా... 24 క్యారెట్ల బంగారం ధర రూ. 55,460 ఉంది. ముంబయి లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 50,980 ఉండగా... 24 క్యారెట్ల బంగారం ధర 51,980 ఉంది. న్యూఢిల్లీ 22 క్యారెట్ల ధర రూ. 51,300... 24 క్యారెట్ల ధర రూ. 55,950.  కోల్కతాలో 22 క్యారెట్ల ధర రూ. 52,520 ఉండగా... 24 క్యారెట్ల ధర రూ. 55,240. బెంగళూరు లో 22 క్యారెట్ల ధర రూ. 49,600.. 24 క్యారెట్ల ధర రూ. 54,110.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: