తెలంగాణ : డియస్సి ఫైనల్ కీ రిలీజ్ ఎప్పుడంటే..?

frame తెలంగాణ : డియస్సి ఫైనల్ కీ రిలీజ్ ఎప్పుడంటే..?

murali krishna
తెలంగాణ రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ఇటీవల నిర్వహించిన ఆన్‌లైన్‌ పరీక్షల ప్రాథమిక కీ విడుదలైనప్పటి నుంచి వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ప్రిలిమినరీ ‘కీ’తో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు కూడా విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ‘కీ’పై అభ్యంతరాలను స్వీకరించేందుకు ఆగస్టు 20వ తేదీ సాయంత్రం 5.00 గంటలతో ముగిసింది. అయితే ఎన్నడూ లేనిది విద్యాశాఖ విడుదల చేసిన డీఎస్సీ ప్రాథమిక ‘కీ’పై భారీగా అభ్యంతరాలు రావడం గమనార్హం. ఈసారి ప్రాథమిక ‘కీ’ని సవాల్‌ చేస్తూ దాదాపు 28,500 అభ్యంతరాలు వచ్చినట్టు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. కాగా జూలై 18 నుంచి ఆగస్టు 13 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రాథమిక కీలను ఆగస్టు 13న విడుదల చేసింది. ఆగస్టు 20వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించారు.TS DSC 2024లో ఉపాధ్యాయుల కోసం డైరక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం రాత పరీక్ష కోసం పాఠశాల విద్యా శాఖ ఇప్పటికే రెస్పాన్స్ షీట్, ఆన్సర్ కీలను విడుదల చేసింది. ఇప్పుడు అభ్యర్థులు TS DSC ఫలితం, మెరిట్ జాబితా 2024కోసం ఎదురుచూస్తున్నారు.డీఎస్సీ  తెలంగాణ భాగస్వామ్యం చేయలేదని గమనించాలి. ఇప్పటి వరకు ఫలితాల ప్రకటన ఏదైనా అధికారిక తేదీ వెల్లడి కాలేదు. అయితే, స్థానిక రిపోర్టుల ప్రకారం, డిపార్ట్‌మెంట్ సెప్టెంబర్ 2024లో ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా డీఎస్సీ పరీక్షల ఫైనల్ కీని వచ్చే నెల 2న రిలీజ్ చేసేందుకు విద్యాశాఖ సిద్ధమవుతుంది. 

అనంతరం జిల్లాల వారీగా ర్యాంకుల జాబితాను వెల్లడించనుంది.రిజర్వేషన్ల ప్రకారం 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను ధృవపత్రాల పరిశీలనకు పిలవనుంది. ఆ తర్వాత మెరిట్ ఉన్నవారికి జాయినింగ్ ఆర్డర్స్ ను అధికారులు ఇవ్వనున్నారు. సాధారణంగా సెప్టెంబరు 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన వారికి ప్రభుత్వం నియామక పత్రాలు అందజేయగా.. అందుకు సంబంధించిన ప్రక్రియను విద్యాశాఖ అధికారులు ఇప్పటికే ప్రారంభించారు.ఇదిలా ఉండగా  ఒకసారి విడుదల చేసిన మెరిట్ జాబితా/ఫలితాలను యాక్సెస్  చేయడానికి అభ్యర్థులు తమ లాగిన్ ఆధారాలను ఉపయోగించాలి. TS DSC కోసం రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో తదుపరి దశ షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల ఆఫ్‌లైన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుంది. దరఖాస్తుదారులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో జిల్లా వెరిఫికేషన్ కేంద్రాలకు హాజరు కావాలి. డిపార్ట్‌మెంట్ ధ్రువీకరించబడిన అభ్యర్థుల కోసం అపాయింట్‌మెంట్ లెటర్‌లను జారీ చేస్తుంది. వాటిని ఈ మెయిల్/పోస్ట్ ద్వారా పంపుతుంది. అంతేకాకుండా, ఒక అభ్యర్థి తన/ఆమె బహుళ పోస్టుల పరీక్షలో అర్హత సాధించినట్లయితే, వారు ఏ పోస్ట్‌ను తీసుకోవాలనుకుంటున్నారో డిక్లరేషన్‌ను సమర్పించాలని డిపార్ట్‌మెంట్ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: