ఏపీ డీఎస్సీ పోస్టులు..జిల్లాల్లో ఇన్ని ఖాళీలున్నాయా.?

Pandrala Sravanthi
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసింది. చంద్రబాబు నాయుడు నాలుగవసారి సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేసేసారు. ఈ క్రమంలోనే ఆయన సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే మొదటి సంతకం మెగా డీఎస్సీ పైన పెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా  డీఎస్సీ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులంతా చంద్రబాబు చిత్ర పటాలకు పాలాభి షేకాలు చేశారు. ఇప్పటికే నిరుద్యోగులంతా పుస్తకాలు పట్టు కొని కుస్తీలు పడుతున్నారు.
 ఎలాగైనా జాబ్ ఈసారి తెచ్చుకోవాలని పోటాపోటీగా చదువుతున్నారు. మొత్తం 16,347 డిఎస్సి పోస్టులకు నోటిఫికేషన్  జారీ అయింది. ఇందులో ఎన్ని పోస్టులు ఉన్నాయి. జిల్లాల వారీగా ఎలా ఉన్నాయి అనే వివరాలు. ఇందులో మొత్తం ఎస్జిటి 6371 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ 7725, టీజీటీ 1781, పిజిటి 286, పిఈటి 132, ప్రిన్సిపల్స్ 52 పోస్టులు ఉన్నాయి. అలాంటి ఈ పోస్టులు జిల్లాల వారీగా చూస్తే మొత్తం జిల్లాలు మండల పరిషత్ మున్సిపల్ స్కూల్లో 14,066 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
 శ్రీకాకుళంలో 543, విశాఖలో 1134, విజయనగరంలో 583,  పశ్చిమగోదావరి జిల్లాలో 1067, తూర్పుగోదావరి 1346, కృష్ణా 1213, ప్రకాశం 672, గుంటూరు 1159, నెల్లూరు 673, చిత్తూరు 1478, అనంతపూర్ 811,  కడప 709, కర్నూలు 2678 ఉన్నాయి.  ఇక రెసిడెన్షియల్, మోడల్ స్కూల్స్, బీసీ, గిరిజన, స్కూల్లో 2281 పోస్టులున్నాయి. ఈ తరుణంలో ప్రతి జిల్లా నుంచి వేలాది మంది నిరుద్యోగులు  పోటీపడే అవకాశం ఉంది. 16,000 పోస్టులకు లక్షలాదిమంది నిరు ద్యోగులు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారు. మరి ఈ ఉద్యోగం  ఎవరిని వరిస్తుంది అనేది  చూద్దాం. ఇదే తరుణంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు కూడా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు డీఎస్సీ విడుదల చేశారు రేవంత్ రెడ్డి మీరు ఎప్పుడు విడుదల చేస్తారని బహటంగానే ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: