విద్యార్థుల జీవితాల్లోకి.. దూరిపోయిన AI?

praveen
ఇటీవల కాలం లో టెక్నాలజీ ఎంతలా పెరిగి పోతుందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. టెక్నాలజీ ఇలా రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతున్న కొద్దీ అటు మనిషి జీవన శైలిలో కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి అని చెప్పాలి. ఒకప్పుడు ఏ పని చేయాలన్నా చెమటోడ్చి కష్ట  పడాల్సిన అవసరం ఉండేది. కానీ ఇప్పుడు ఒక్క చుక్క చెమట చిందించ కుండానే మనిషి అన్ని పనులను పూర్తి చేసుకుంటున్నాడు.

 టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రతి పనిని సులభతరం చేసుకుంటున్నాడు. ఇలా నేటి రోజుల్లో టెక్నాలజీ మనిషి జీవన విధానం లో ఎన్నో మార్పులు తీసుకు వచ్చింది అని చెప్పాలి. అయితే ఈ మధ్యకాలం లో అయితే ఆర్టిఫిషియల్  ఇంటిలిజెంట్ అనే టెక్నాలజీ మనుషులు చేసే ప్రతి పనిని కూడా చేస్తుంది. దీంతో రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ టెక్నాలజీతో మనిషి మనుగడకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని ఎంతోమంది నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే.

 ఇప్పటికే ఎన్నో సంస్థలు ఉద్యోగులను తొలగించి.. వారి స్థానం లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో పని చేయించు కుంటున్నారు. అయితే ఇక ఇప్పుడు ఏకంగా విద్యార్థుల జీవితాల్లోకి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దూరి పోయింది అన్నది తెలుస్తుంది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్స్ ను స్కూల్ లలో విద్యార్థులకు పాఠ్యాంశం  గా చేర్చాలని కేరళ ప్రభుత్వం అనుకుంటుందట. జూన్ మూడవ తేదీ నుంచి ప్రారంభమయ్యే కొత్త విద్యా సంవత్సరం నుంచి ఏడో తరగతి పాఠ్య ప్రణాళికతో ఏఐ గురించి పాఠ్యాంశం చేర్చేలా నిర్ణయం తీసుకుంటుందట. ప్రపంచ వ్యాప్తం గా కృత్రిమ మేధ వాడకం తో పాటు డిమాండ్ పెరిగి పోతున్న నేపథ్యం లో విద్యార్థులకు ఏఐపై మరింత అవగాహన కలిగేలా ఇక ఇలాంటి పాఠ్యాంశాలను ఏర్పాటు చేసేందుకు అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ai

సంబంధిత వార్తలు: