నిరుద్యోగులకు శుభవార్త..9,212 కానిస్టేబుల్ పోస్ట్స్..!!

Divya
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తాజాగా సిఆర్పిఎఫ్ (CRPF)లో భారీ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తంగా 9,212 ఉద్యోగాలను నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థులు మార్చి 27 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చట. డైరెక్టర్ జనరల్ కార్యాలయం నుంచి ఈ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఈ పోస్టులకు పురుషులు మహిళా అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

సిఆర్పిఎఫ్ పోలీస్ ఫోర్స్ అనేది కేంద్ర సాయుధ పోలీసు బలగాలలో ఒకటని తెలిసిందే.. ఇది భారత ప్రభుత్వం హోమ్ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందట. PET &PST ట్రేడ్ టెస్ట్ డాక్యుమెంటరీ వెరిఫికేషన్.. డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.. టెక్నికల్ మరియు ట్రేడ్ మ్యాన్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఫోటోలను అధికారిక వెబ్సైట్ WWW.CRPF.NIC.IN లో చూడవచ్చు. మొత్తం మీద 9,212 పోస్టులు ఉండగా ఇందులో ఆంధ్రప్రదేశ్లో 428 పోస్టులు తెలంగాణలో 307 పోస్టులు కలవు.

ఇక దరఖాస్తు ఫీజు రూ.100 రూపాయలు ఎస్సీ ఎస్టీ మహిళ అభ్యర్థులకు ఎలాంటి పరీక్ష ఫీజు లేదు. మార్చి 27 నుంచి ఏప్రిల్ 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు ఆన్లైన్ ద్వారా చెల్లించాలి జూన్ 20 నుంచి 25 వరకు CBT పరీక్షకు అడ్మిట్ కార్డులను విడుదల చేస్తారు. కంప్యూటర్ బెస్ట్ ఫిజికల్ స్టాండర్డ్ ఎగ్జామ్ ఫిజికల్ ఏపీ సీఎం టెస్ట్, ట్రేడ్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. CBT ఎగ్జామ్స్ జూలై 1 నుంచి 13 వరకు నిర్వహిస్తారు. ఎగ్జామ్ పేపర్ ఇంగ్లీష్ హిందీలో మాత్రమే ఉంటుంది ఉద్యోగంలో భర్తీ అనంతరం రూ.21,700 నుంచీ రూ.68,100 రూపాయల వరకు ఉంటుంది ఇందులో డ్రైవర్ ఉద్యోగాలకు 21 నుంచి 27 ఏళ్ల వయసు ఉండాలి. రిజర్వేషన్ రీత్యా ఎస్సీ, ఎస్టీ ,బీసీలకు వయోపరిమితి కూడా కలదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: