విద్యార్థులకు గుడ్ న్యూస్: చౌక ధరలో బెస్ట్ లాప్టాప్?

Purushottham Vinay
ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రస్తుతం అత్యాధునిక ప్యూచర్స్‌తో కూడిన కొత్త కొత్త కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు ఇంకా అలాగే మొబైల్ ఫోన్లు మార్కెట్లోకి విడుదల అవుతున్నాయి.ఇక కరోనా వైరస్ కారణంగా రెండు సంవత్సరాలపాటు విద్యాసంస్థలు పూర్తిగా బంద్ అయిన విషయం అందరికి కూడా తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని కంపెనీలు విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని, వారి విద్యకు అవసరమైన విధంగా ల్యాప్‌టాప్‌లను తయారు చేస్తున్నాయి. ఇంకా అంతేకాదు, ప్రస్తుత ప్రపంచంలో కంప్యూటర్, మొబైల్ ఫోన్‌ ఇంకా అలాగే ల్యాప్‌టాప్‌లు అనేవి విద్యార్థులకు నిత్య పరికరాలుగా మారిపోయాయి.ఇటువంటి సమయంలో విద్యార్థినీ, విద్యార్థులకు ఇన్ఫినిక్స్ ఇండియా కంపెనీ ఒక మంచి శుభవార్తను చెప్పింది.తమ కంపెనీ తయారు చేసిన ల్యాప్‌టాప్‌ను చాలా తక్కువ బడ్జెట్‌లోనే విక్రయిస్తున్నట్లు పేర్కొంది. తాజాగా ఆ ల్యాప్‌టాప్‌ను మార్కెట్లోకి కూడా విడుదల చేసింది. "ఇక ఇన్ఫినిక్స్ ఇన్ బుక్ ఎక్స్ 1 నియో పేరుతో ఈ ల్యాప్‌టాప్‌ను మార్కెట్లో విడుదల చేశాం. దీని ధర వచ్చేసి రూ.24,990. ఇది మంచి పనితీరుతో కూడిన అనుభవాన్ని ఇస్తుంది.ఇంకా అలాగే ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ల్యాప్‌టాప్ బరువు వచ్చేసి 1.24 కిలోలు. 14.8 ఎంఎం మందంతో ఇది నాజూకుగా ఉంటుంది. 


ఇంటెల్ సెల్ రాన్ క్వాడ్ కోర్ ఎన్ఎస్ 5100 ప్రాసెసర్‌తో ఇది పనిచేస్తుంది. 8 జీబీ ర్యామ్ ఇంకా అలాగే 256 జీబీ స్టోరేజీతో వస్తుంది." అని ఇన్ఫినిక్స్ కంపెనీ తెలిపింది.ఇక అంతేకాదు, ఈ ల్యాప్‌టాప్ విద్యార్థులకు చాలా బాగా ఉపయోగపడుతుందని, దీనిని అల్యూమినియం అల్లాయ్ ఆధారిత మెటల్ బాడీతో తయారు చేశామని కూడా వారు పేర్కొన్నారు. ఈ ల్యాప్‌టాప్ కాస్మిక్ బ్లూ ఇంకా స్టార్ ఫాల్ గ్రే రంగుల్లో లభిస్తుందని, ఈ నెల 21 వ తేదీ నుంచి ఫ్లిప్ కార్ట్‌లో అమ్మకాలు మొదలవుతాయని కూడా తెలిపింది. సిటీ, ఆర్బీఎల్, కోటక్ ఇంకా అలాగే యాక్సిస్ బ్యాంకు కార్డులతో కొంటే తగ్గింపు లభిస్తుందని,ఇంకా ప్రధానంగా విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ఈ ల్యాప్ టాప్ తయారు చేసినప్పటికీ, ఇతరుల అవసరాలకు కూడా ఈ లాప్టాప్ చాలా బాగా ఉపయోగపడుతుందని కంపెనీ అధికారులు వివరాలను వెల్లడించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: