ఇంటర్ విద్యార్థుల కొత్త అకడమిక్ క్యాలెండర్ ఇదే... ఒక లుక్ వేయండి ?

VAMSI
ఈ ఏడాది 2022-23 విద్యాసంవత్సరానికి గాను తాజాగా అకడమిక్‌ క్యాలెండర్‌ను విడుదల చేసింది ఇంటర్మీడియట్‌ బోర్డు. అయితే ఆ వివరాలు ఇలా ఉన్నాయి. మొత్తం ఈ ఏడాది లో 295 రోజులు కాగా అందులో 220 పనిదినాలు ఉండగా 75 రోజులు సెలవు దినాలుగా తెలిపింది. అయితే మధ్యలో ఏమైనా ముఖ్య కార్యక్రమాలకు అలాగే లోకల్ ఫెస్టివల్స్ కు ఆయా ప్రాంతాలలోని విధ్యా సంస్థలు స్వచ్ఛందంగా సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఈ ఏడాది అనగా 2023 ఏప్రిల్‌ 21వ తేదీతో విద్యాసంవత్సరం ముగియనుంది అని పేర్కొన్నారు.
ఆ మరుసటి రోజు నుంచి మే 31వ తేదీ వరకు కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించడానికి ఇప్పటికే నిర్ణయించడం జరిగింది. అదే విధంగా ప్రస్తుతం కాలేజీల్లో కొత్త అడ్మిషన్ల జోరు మొదలుకానున్న నేపథ్యంలో  ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రకటించిన షెడ్యూల్‌ మేరకు మాత్రమే ఆయా కాలేజీలు అడ్మిషన్లు నిర్వహించవలసిందిగా బోర్డు కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు ఆదేశాలు జారీచేశారు. ఇక గతం లోలా అడ్మిషన్ల కోసం ప్రకటనలు, లేదా పలు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు లేదా ఇతర ఇతర రకాల చర్యలతో విద్యార్థులను ఆకర్షించడం వంటి కార్యక్రమాలు చేయరాదని , చేసేలా సంస్థలు ప్రేరేపించకూడదని స్పష్టం చేస్తూ సూచించారు.
కరోనా కారణంగా విద్యా సంస్థలు సైతం మూత పడ్డ విషయం తెలిసిందే. దాంతో విద్యార్దులు నెలల తరబడి ఇంటికే పరిమితమై పోవడంతో వారి చదువు అటకెక్కింది.  అయితే కరోనా వ్యాప్తి తగ్గడంతో అన్ని రంగాలతో పాటు విద్యారంగం కూడా మళ్ళీ మొదలయ్యింది. అయితే విద్యార్థుల్ని మళ్ళీ విద్యతో బిజీ చేస్తూ వారిలో తిరిగి నైపుణ్యాలను పెంచే విధంగా ప్రణాళికలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇంటర్మీడియట్ బోర్డు కొత్త షెడ్యూల్ ని కూడా విడుదల చేసింది. ఈ క్యాలెండర్ ను ఫాలో అయ్యి విద్యార్ధులు మంచిగా చదువుకోవాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: