కొట్టేద్దాం జాబ్‌: పాలిటీకి ఏ బుక్ చదవాలి?

గ్రూప్స్ ఉద్యోగాల పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి పాలిటీ ఓ కీలకమైన సబ్జక్టు.. తెలుగులో చెప్పాలంటే రాజనీతి శాస్త్రం. ఇది చరిత్రలా మారకుండా ఉండే సబ్జక్టు కాదు.. రాజనీతి శాస్త్రంలోని అంశాలు ఇవాళ్టి సమాజంలో వచ్చే వార్తలను సమన్వయం చేసుకుంటూ చదువుకోవాలి. మరి ఈ పాలిటీకి ఏ పుస్తకాలు చదవాలి.. ఏవి ప్రామాణిక గ్రంధాలు అన్న విషయం చూస్తే.. పోటీ పరీక్షలకు ప్రామాణిక గ్రంధాలు ఎంచుకోవడం చాలా కీలకమైన వ్యవహారం.

పాలిటీ విషయానికి వస్తే.. తెలుగులో రెండు మూడు ప్రామాణిక గ్రంధాలు ఉన్నాయి. తెలుగు అకాడమీ వారు భారత రాజ్యాగం అనే పుస్తకం ప్రచురించారు. ఇది పోటీ పరీక్షలకు ఉద్దేశించి ప్రచురించిన గ్రంథం. ఇది చాలా వరకూ పాలిటీని కవర్ చేస్తుంది. ఇక లక్ష్మీకాంత్‌ రాసిన ఇండియన్ పాలిటీ గ్రంధం చాలా ప్రామాణికమైన గ్రంథం. దీన్ని సివిల్స్ ప్రిపేరయ్యేవారు ఓ బైబిల్‌, భగవద్గీత, ఖురాన్‌గా భావిస్తారంటే.. ఇది ఎంత ప్రామాణిక గ్రంథమో అర్థం చేసుకోవచ్చు.

అయితే.. ఈ పుస్తకం అనువాద భాష కాస్త ఇబ్బంది కరంగా ఉందన్న విమర్శలు ఉన్నా.. ఇది చాలా ప్రామాణికమైన గ్రంథం. టాటా మెక్‌గ్రాత్‌ వారు ప్రచురించిన ఈ లక్ష్మీకాంత్ పాలిటీ పుస్తకం తెలుగు అనువాదం కూడా మార్కెట్లో లభిస్తోంది. శుభవార్త ఏంటంటే తెలుగులో అరుదుగా రివైజ్‌డ్‌ ఎడిషన్స్ వస్తుంటాయి. తాజాగా 2022 రివైజ్డ్‌ ఎడిషన్‌ ఇప్పుడు అందుబాటులో ఉంది. అయితే ఈ పుస్తకంలో ఇచ్చిన అనుబంధాల సమాచారం 2021 వరకే ఉందని చెబుతున్నారు. చిన్న చిన్న అప్‌డేషన్స్ ఉంటే ప్రిపరేషన్‌ సమయంలో  చేసుకోవచ్చు.

ఇక లక్ష్మీకాంత్ కాకుండా తెలుగులో కృష్ణ ప్రసాద్‌ రాసిన ఇండియన్ పాలిటీ బుక్ కూడా బావుందని అభ్యర్థులు చెబుతున్నారు. విన్నర్స్ పబ్లికేషన్స్ ఈ పుస్తకం ప్రచురించారు. ఈ రెండింటిలో ఏదైనా ఒక దాన్ని కొనుక్కుని బాగా ప్రిపేర్‌ అయితే మంచి స్కోరింగ్ వచ్చే అవకాశం ఉంది. అలాగే.. రాజనీతి శా‌స్త్రానికి సంబంధించిన తాజా సమాచారం ఎప్పటికప్పుడు పత్రికల ద్వారా అప్‌డేట్ అయితే.. మంచి స్కోర్ సాధించవచ్చు. ఆల్ ది బెస్ట్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: