RBIలో ఉద్యోగాలు.. అర్హత, పూర్తి వివరాలు!

Purushottham Vinay

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గ్రేడ్ 'A'లో అసిస్టెంట్ మేనేజర్ (రాజ్‌భాష) ఇంకా అసిస్టెంట్ మేనేజర్ (ప్రోటోకాల్ & సెక్యూరిటీ) పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ - chance.rbi.org.in ద్వారా ఏప్రిల్ 18, 2022, సాయంత్రం 6:00 గంటల వరకు దరఖాస్తు చేసుకోగలరు. RBI అసిస్టెంట్ మేనేజర్‌కి సంబంధించిన పరీక్ష మే 21న జరుగుతుంది. మొత్తం pf 6 పోస్టులు ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా భర్తీ చేయబడతాయి.

 RBI రిక్రూట్‌మెంట్ 2022: అర్హత ప్రమాణాలు, వయోపరిమితి

రాజభాష: మార్చి 1, 2022 నాటికి 21-30 సంవత్సరాలు.

ప్రోటోకాల్ & సెక్యూరిటీ : మార్చి 1, 2022 నాటికి 25-40 సంవత్సరాలు.

అర్హత

రాజభాష అభ్యర్థి బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఇంగ్లీష్‌ని ఒక సబ్జెక్ట్‌గా హిందీ/హిందీ ట్రాన్సలేషన్లో సెకండ్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి.లేదా ఇంగ్లీష్ ఇంకా హిందీ/హిందీ ట్రాన్సలేషన్ రెండింటిలోనూ మాస్టర్స్ డిగ్రీ ఉండాలి.

ప్రోటోకాల్ & సెక్యూరిటీ అభ్యర్థి ఆర్మీ/నేవీ/ఎయిర్ ఫోర్స్‌లో కనీసం ఐదు సంవత్సరాల కమీషన్డ్ సర్వీస్ ఉన్న అధికారి అయి ఉండాలి.

RBI రిక్రూట్‌మెంట్ 2022: ఎంపిక ప్రక్రియ

పరీక్ష ఇంకా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరుగుతుంది.

RBI రిక్రూట్‌మెంట్ 2022: దరఖాస్తు రుసుము

600 దరఖాస్తు రుసుము వసూలు చేయబడుతుంది

SC/ST/PwBD అభ్యర్థులకు రూ.100 దరఖాస్తు రుసుము వసూలు చేయబడుతుంది.

RBI రిక్రూట్‌మెంట్ 2022: దరఖాస్తు చేయడానికి దశలు

అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి - chances.rbi.org.in

హోమ్‌పేజీలో 'Vacancies'' విభాగం కింద 'Current Vacancies ' పై క్లిక్ చేయండి. గ్రేడ్ 'A'-ప్యానెల్ ఇయర్-2021'లో 'అసిస్టెంట్ మేనేజర్ (రాజ్‌భాష) ఇంకా అసిస్టెంట్ మేనేజర్ (ప్రోటోకాల్ & సెక్యూరిటీ)పై క్లిక్ చేయండి.

ఇప్పుడు, హైపర్ లింక్ 'ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్'పై క్లిక్ చేయండి.

IBPS పోర్టల్‌లో నమోదు చేసుకోండి. ఇంకా కావలసిన ఆఫీసర్ల పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోండి.

అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి, దరఖాస్తు రుసుమును చెల్లించండి. తరువాత సబ్మిట్ పై క్లిక్ చేయండి. అర్హత ఇంకా అలాగే ఆసక్తి వున్న అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

RBI

సంబంధిత వార్తలు: