విద్యార్థుల్లారా... "టెట్" కు అప్లై చేశారా?
టెట్ కి నోటిఫికేషన్ విడుదల చేశారు. నేటి నుండి ఏప్రిల్ 12 వ తేదీ వరకు టెట్ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సదరు అధికారులు వెల్లడించారు. ఇక మరొక శుభవార్త ఏమిటంటే బీఈడి, డిఈడి ఫైనల్ ఇయర్ విద్యార్దులకు కూడా టెట్ కు అప్లై చేసుకునే అవకాశాన్ని అందించారు. ఒకవేళ సదరు విద్యార్థులు కనుక ఫైనల్ ఇయర్ కనుక చదువుతున్నట్లు అయితే వారు ఇపుడు టెట్ కు దరఖాస్తు పంపవచ్చు. పాత సిలబస్ లను ఫాలో అయ్యే వారికి ఇబ్బంది లేకుండా 2017 టెట్ సిలబస్ ప్రకారమే ఈ సారి టెట్ కు కూడా పరీక్షలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి హెల్ప్ డెస్క్ సేవలు నేటి నుండి అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు.
జూన్ 12 న టెట్ exam ఉండబోతుంది. 27 న ఫలితాలు రానున్నట్లు ప్రకటించారు. ఈ టెట్ కు సంబందించిన పూర్తి వివరాల కొరకు tset.egg.gov.in చూడవచ్చు. టెట్ లో మంచి మార్కులు వచ్చినట్లు అయితే అవి టీచర్ జాబ్ కొరకు బాగా ప్లస్ అవుతుందన్న విషయం తెలిసిందే. కాబట్టి మీరు ఇప్పటికే రాసి ఉన్నప్పటికీ మంచి మార్కుల కొరకు మళ్ళీ అశ్రద్ద చేయకుండా ప్రయత్నించండి. టెట్ సిలబస్ ను సరిగా చూసుకుని ఒక ప్రణాళిక ప్రకారం ప్రిపరేషన్ ను చేసుకుని అనుకున్న లక్ష్యం వైపు అడుగులు వేయండి.