ఒమిక్రాన్ ఎఫెక్ట్ : త‌మిళ‌నాడులో పాఠ‌శాల‌లు బంద్‌..ఎప్ప‌టివ‌ర‌కు అంటే..?

N ANJANEYULU
క‌రోనా విధ్వంసం కార‌ణంగా త‌మిళ‌నాడులోని పాఠ‌శాల‌ల‌కు సెల‌వులు ప్ర‌క‌టించారు. క‌రోనా కేసుల‌ను దృష్టిలో ఉంచుకుని.. రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌ళ్లీ కొన్ని త‌ర‌గ‌తుల‌ను మూసివేసింది. ఇత‌ర త‌ర‌గ‌తులు, క‌ళాశాల విద్యార్థుల‌కు మార్గ‌ద‌ర్శ‌కాలు కూడా స‌వరించారు. పెరుగుతున్న క‌రోనా, ఒమిక్రాన్ కేసుల కార‌ణంగా రాష్ట్ర ప్ర‌భుత్వం తాజాగా నిషేదం విధించింది. ముఖ్యంగా త‌మిళ‌నాడులో 1 నుంచి 8వ త‌ర‌గ‌తి వ‌ర‌కు పాఠ‌శాల‌లు జన‌వ‌రి 10, 2022 వ‌ర‌కు మూసివేస్తున్న‌ట్టు ఉత్త‌ర్వులు జారీ చేసారు. అయితే అప్ప‌టివ‌ర‌కు ప‌రిస్థితి అనుకూలించ‌కుంటే మ‌ర‌ల పొడిగించే అవ‌కాశం కూడా ఉన్న‌ట్టు తెలుస్తోంది. అయితే 9వ త‌ర‌గ‌తి నుండి కళాశాల విద్యార్థుల‌కు మాత్రం కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసారు.
అంత‌ర్జాతీయ ప్ర‌యాణ చ‌రిత్ర‌లేని వ్య‌క్తులు ఇన్‌ఫెక్ష‌న్ కు గుర‌వుతున్నందున త‌మిళ‌నాడులో కొవిడ్ కేసులు చాలా మందిని ఆశ్య‌ర్యానికీ గురి చేసాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రప్ర‌భుత్వం పాఠ‌శాల‌ల‌ను మూసేయాల‌ని నిర్ణ‌యించింది. రాష్ట్ర ప్ర‌భుత్వాలు విధించిన కొత్త ఆంక్ష‌ల ప్ర‌కారం.. 9 నుంచి 12 త‌ర‌గ‌తుల పాఠ‌శాల‌లు, కొవిడ్‌-19 భ‌ద్ర‌తా ప్రొటోకాల్‌ల‌ను అనుస‌రించి ప‌ని చేస్తాయి. దీంతో పాటు త‌మిళ‌నాడులోని క‌ళాశాల‌లు కూడా కొవిడ్ త‌గిన ప్ర‌వ‌ర్త‌నతో ఆఫ్‌లైన్ త‌ర‌గ‌తుల‌ను కొన‌సాగించాలి అని సూచించారు. నివేదిక‌ల ప్ర‌కారం.. త‌మిళ‌నాడులోని పాఠ‌శాల‌లు, సెల‌వుల అనంత‌రం తొలుత జ‌న‌వ‌రి 03, 2022 నుండి తిరిగి తెర‌వాల్సి ఉంది.
త‌మిళ‌నాడులో ప్ర‌స్తుతం జ‌న‌వ‌రి 10 వ‌ర‌కు ఆంక్ష‌లు అమలులో ఉన్నాయి. క‌రోనా కేసులు త‌గ్గ‌క‌పోతే.. మ‌రింత క‌ఠిన‌మైన ఆంక్ష‌ల‌ను అమ‌లు చేయ‌డం ద్వారా వాటిని కూడా పెంచ‌వ‌చ్చు. నివేదిక‌ల ప్ర‌కారం.. త‌మిళ‌నాడులోని పాఠ‌శాల‌లు మొద‌ట జ‌న‌వ‌రి 03, 2022 నుంచి తిరిగి తెర‌వాల్సి ఉంది. మ‌రొక‌వైపు త‌మిళ‌నాడులో కురుస్తున్న భారీ వ‌ర్షాల కార‌ణంగా చెన్నైతో పాటు పొరుగు జిల్లాల‌లోని పాఠ‌శాల‌లు మూత‌ప‌డ్డాయి.
త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్ సోమ‌వారం పోరూర్‌లోని ప్ర‌భుత్వ బాలిక‌ల ఉన్న‌త పాఠ‌శాల‌లో చిన్నారుల‌కు క‌రోనా వ్యాక్సినేష‌న్ శిబిరాన్ని కూడా ప్రారంభించ‌నున్నారు. దేశంలో  ఉన్న‌టువంటి 15-18 ఏళ్ల వ‌య‌స్సుగ‌ల పిల్ల‌ల‌కు క‌రోనా టీకాలు వేయ‌డం జ‌న‌వ‌రి 03 నుంచి ప్రారంభ‌మ‌వ్వ‌నున్న‌ది. ఈ టీకాల కోసం రిజిస్ట్రేష‌న్లు జ‌న‌వ‌రి 01 నుంచే ప్రారంభ‌మైన విష‌యం విధిత‌మే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: