దేశంలో టా‌ప్‌ ఐఐటీలు ఇవే.. లేటెస్ట్ రిపోర్ట్..?

దేశంలో ఎందరో యువ మేధావులు.. అలాంటి మేధావులకు వేదికలు ఐఐటీలు.. ఎందుకు కత్తిలాంటి కుర్రాళ్లంతా ఐఐటీల్లోనే ఉంటారు.. ఎందుకంటే.. కత్తి లాంటి యువతకే ఐఐటీల్లో సీట్లు వస్తాయి. మరి అలాంటి ఐఐటీల్లో ప్రస్తుతం ఏది టాప్‌లో ఉంది.. ఈ విషయాన్ని తేల్చేందుకు ఏటా కేంద్ర ప్రభుత్వం ఓ సర్వే నిర్వహిస్తుంది.. దీనికి అనేక ప్రాతిపదికలు పెట్టుకుని ఈ సర్వే నిర్వహిస్తారు. ఈసారి నవ కల్పనలకు ప్రోత్సాహం, మద్దతు, వ్యాపార నిర్వహణ శిక్షణలో మంచి పని తీరు.. ఇలాంటి అంశాల ఆధారంగా ఐఐటీలపై సర్వే నిర్వహించారు. ఈ ర్యాంకింగ్‌లను అటల్ ర్యాంకింగ్స్ అంటారు.

ఈ ఏడాది అటల్‌ ర్యాంకింగ్స్‌ తొలి పది స్ధానాల్లో దేశంలోని ఏడు ఐఐటీలు ఉన్నాయట. అలాగే  బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ కూడా ఈ అటల్ ర్యాంకింగ్స్‌లో స్థానం సంపాదించింది. మరి ఇంతకీ ఐఐటీల్లో టాప్ ఏది అంటారా.. అది మద్రాస్‌ ఐఐటీ. ఈ మద్రా‌స్‌ ఐఐటీ అటల్ ర్యాంకింగ్స్‌లో తొలి స్ధానం సంపాదించింది. ఆ తర్వాత స్థానాల్లో ఐఐటీ బాంబే, ఐఐటీ దిల్లీ, ఐఐటీ కాన్పూర్‌, ఐఐటీ రూర్కీ ఉన్నాయి.

ఇక బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ ఆరో ర్యాంకింగ్‌ సంపాదించింది. ఆ తర్వాత ఏడో స్ధానాన్ని మన ఐఐటీ హైదరాబాద్‌ దక్కించుకుంది. కొత్త ఆలోచనలు, స్టార్టప్‌ పరిశ్రమలు, వ్యాపార నిర్వహణకు ప్రోత్సాహం అనే విషయాల్లో దేశంలోని ఉన్నత విద్యా సంస్ధలకు ఓ క్రమ పద్ధతిలో ర్యాంకింగ్‌ ఇస్తుంటారు. కేంద్ర విద్యాశాఖ  ఇచ్చే ఈ ర్యాంకులకు చాలా ప్రామాణికత ఉంటుంది.

ఈ ర్యాంకులను లెక్కేసేటప్పుడు అనేక విషయాలను దృష్టిలో పెట్టుకుంటారు. కొత్త ఆలోచనలను ప్రోత్సహించే సంస్థలకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఐఐటీల్లోని మౌలిక సదుపాయాలను కూడా ర్యాంకింగ్స్ విషయంలో పరిగణనలోకి తీసుకుంటారు. మొత్తానికి ఈ ఏడాది ఐఐటీ చెన్నై మరోసారి టాప్ ఐఐటీగా నిలిచిందన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

iit

సంబంధిత వార్తలు: