మసకబారుతున్న చదువులు.. ఇక మార్పు రాదా..!

MOHAN BABU
ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య.. అందరికీ విద్యను అందించడమే మా లక్ష్యం.. ఇలాంటి నినాదాలను ఏళ్ల నుంచి మనం వింటూనే ఉన్నాం. వీటి గురించి పాలకులు ఎంత  ఊదరగొట్టిన సర్కారు బడుల్లో చదువుకు సంబంధించిన వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటున్నాయి. ఫలితంగా పేద పిల్లలకు ఉచిత విద్య కాదుగదా.. ప్రాథమిక విద్య కూడా అందని ద్రాక్షగా మారింది. ఒకవేళ అందినా అది నామ్ కే వాస్తేగానే ఉంటుంది తప్ప నాణ్యమైన విద్యా మచ్చుకైనా కానరావడం లేదు. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత కేజీ టు పీజీ వరకూ ఉచిత విద్య అందిస్తా మంటూ ప్రభుత్వం ప్రకటించింది. దీని గురించి పలుమార్లు మంత్రులను ప్రశ్నించిన సమయాల్లో.. కేజీ అంటే అంగన్వాడీలు, పీజి అంటే ఉస్మానియా, కాకతీయ అనే సమాధానం ఇచ్చిన సందర్భాలు లేకపోలేదు.

అదే క్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, గురుకులాలు ఏర్పాటయ్యాయి. కామన్ విద్యా, విధానం అనే స్పూర్తికి విఘాతం కలిగినప్పటికీ ఆంగ్ల మాధ్యమం అవసరం, అనివార్యత, దానిపై తల్లి దండ్రులకు ఉన్న మోజు, పిల్లలకు పోషకాహారం లభిస్తుందనే ఆశ.. వెరసి వారిని సాకలేని పేదలు,  సామాన్యులను గురుకుల వైపు మళ్లేలా చేశాయి. ఏదైతేనేం అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక మంది బడుగు, బలహీన వర్గాల వారి పిల్లలు గురుకులాల్లో చదువు కున్నది నిజం. వారిలో కొంతమంది మంచి ప్రతిభ పాటవాలను ప్రదర్శించి ప్రయోజకులైన వాస్తవాన్ని కూడా మనం కాదనలేం. వాటితోపాటు గతం నుంచి ఉన్న సంక్షేమ హాస్టళ్లు కూడా కొనసాగుతూ వచ్చాయి. ఇప్పుడు కొనసాగుతున్నాయి. కాకపోతే ఇటీవల గురుకులాల్లో, సంక్షేమ హాస్టళ్లకు సంబంధించి వెలుగుచూసిన ఘటనలు ఇటు  తల్లిదండ్రులు, అటు  పిల్లలను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఇలాంటి సమస్య లన్నింటికీ ప్రధాన కారణం విద్యారంగానికి సంబంధించి ప్రభుత్వానికి దీర్ఘకాలిక లక్ష్యం అంటూ లేకపోవడమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: