అమెరికాలో.. భారీగా ఉద్యోగాలు..!
దీనితో ఆయా సంస్థలలో ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉంది. ఆ కొరతను తీర్చుకోవడానికి, తాము చేసిన తప్పుడు నిర్ణయానికి ఫలితంగా రెట్టింపు జీతాలు ఇస్తామని చెప్పినప్పటికీ ఉద్యోగులు వచ్చేందుకు సిద్దపడటం లేదు. దానితో ప్రస్తుతం అమెరికాలో పలు సంస్థలు ఈ తరహా సంక్షోభాన్ని తీవ్రంగానే ఎదుర్కొంటున్నాయి. దేశంలో ఎన్నడూ లేని నిరుద్యోగసమస్య ఉన్నప్పటికీ, మరోపక్క ఉద్యోగాలు కూడా భారీగానే ఉన్నాయి. కానీ అందులో చేరే వారి సంఖ్య మాత్రం గణనీయంగా తగ్గిపోయింది. దీనితో ఆయా సంస్థలు తలలు పట్టుకుంటున్నారు.
అప్పట్లో దాదాపుగా 44 లక్షల మంది ఒక్కసారిగా రాజీనామా చేసేశారు. వాళ్ళు మాత్రం మళ్ళీ తమ ఉద్యోగాలలో చేరేందుకు సంసిద్ధంగా లేరట. ఇక దేశంలో ప్రస్తుతం 1.4 కోట్ల ఉద్యోగాలు కూడా అందుబాటులో ఉన్నాయి. త్వరలో పండుగలు వస్తున్నాయి కాబట్టి అవన్నీ అవగానే సంస్థలు ఉద్యోగులను బ్రతిమిలాడో బామాలో ఎక్కువ మొత్తంలో బోనస్ లవంటివి ప్రకటించో ఉద్యోగాలను భర్తీ చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రభావం బాగా కనిపిస్తున్న వాటిలో రెస్టారెంట్లు, హోటళ్లు, రిటైల్, వ్యక్తిగత సేవా విభాగం, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయి. ఇది ఇతర దేశాలకు శుభవార్త అని చెప్పవచ్చు. వీసా ఉంటె ఉద్యోగం దొరికే అవకాశం చాలా ఉన్నట్టే అంటున్నారు నిపుణులు.