9 కే పాస్ మార్కులు !

9 కే పాస్ మార్కులు !  


ఆంధ్ర ప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల పనితీరు  ఆశించినంతగా లేదు. అక్కడ నుంచి వస్తున్న ఫలితాలు అంతంత మాత్రం గానే ఉన్నాయి. ఈ విషయాన్ని తెలిపింది  ఎవరో కాదు, సాక్షాత్తూ న్యాక్ కౌన్సిల్. అంతే కాదు, విద్యార్థులకు, వారి తల్లితండ్రులకు కళ్లు తిరిగే వాస్తవాన్ని వెల్లడించింది.  నేషనల్ అసెస్ మెంట్ అ క్రెడిటేషన్ (న్యాక్)  కౌన్సిల్ తాజాగా క్వాలిటీ ఫ్యాక్ట్ షీట్ ను విడదల చేసింది.  న్యాక్ గుర్తింపు పొందిన విశ్వ విద్యాలయాలు ఆంధ్ర ప్రదేశ్ లో కేవలం తొమ్మిది మాత్రమే ఉండడం గమనార్హం. ఆంధ్ర ప్రదేశ్ లలో 47 యూనివర్సిటీలున్నాయి. వీటిలో పాస్ మార్కులు సాధించినవి కేవలం తొమ్మిదే. నెల్లూరు లోని విక్రమ సింహపురి యానివర్సిటీ, ఆదికవి నన్నయ యూనివర్సిటీ,  అనంతపురంలోని జే|ఎన్ టియూ యూనివర్సిటీ,  ఆర్జేయూ కెటి యూనివర్సిటీలు కూడా న్యాక్ గుర్తింపును సాధించడంతో విఫలమమయ్యాయి.
  నేషనల్ అసెస్ మెంట్ అ క్రెడిటేషన్  గుర్తింపు అనేది విశ్వ విద్యాలయాల ప్రామాణికతకు ఒక కొలబద్ద. ఈ కౌన్సిల్ ప్రభుత్వాలకు  ఎప్పటి కప్పడు సిఫార్సులు చేస్తుంటుంది. తప్పులు సరిదిద్దుకోమని సూచనలు చేస్తుంది. ఈ కౌన్సిల్ గుర్తింపు లభించాలంటే ముందు చేయవలసిన పని...విద్యా ప్రమాణాలను పెంచడం. అందుకు తగ్గట్టుగా బోధనా సిబ్బందిని నియమించడం. బోధనేతర  సిబ్బంది ఖాళీలను కూడా పూర్తి చేయడం. ఎప్పటి కప్పడు నూతన విద్యా విధానాలను ఆకళింపు చేసుకోవడం. మారుతున్న జీవన శైలి, పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టుగా నూతన కోర్సులను ఏర్పాటు చేయడం. విద్యార్థుల  భవిష్యత్ అవసరాలను గుర్తించి అందుకు తగ్గట్టుగా పాఠ్యాంశాలలో మార్పులు చేయడం తదితర పనులు చేయాల్సి ఉంటుంది. అంతే కాదు విద్యార్థుల స్కారలర్ షిప్ లను సకాలంలో అందజేయడం.
  నేషనల్ అసెస్ మెంట్ అ క్రెడిటేషన్  కౌన్సిల్(న్యాక్)  తాజా ప్రభుత్వానికి, యూనివర్సిటీలకు కొన్ని సూచనలు చేసింది. విద్యా విధానాన్ని పరిశ్రమలతో అనుసంధానం చేయాలని సూచించింది.  ప్రతి యూనివర్సిటీ కూడా పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపింది.  వర్సిటీలలో మౌలిక సదకుపాయాలు కల్పించాలని సూచించింది. సదుపాయాలు మరిన్ని కల్పిస్తే విదేశీ విద్యార్థులను అకర్షించే వీలవుతుందని తెలిపింది. పరిశోధనా విద్యార్థులకుప్రోత్సాహకాలు అందించాలని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: