పలు ఉద్యోగాలు .. దరఖాస్తు చేశారా ..

కరోనా మెల్లిగా తగ్గుముఖం పడుతుండటంతో సంస్థలు ఇప్పుడిప్పుడే ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు కూడా పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తున్నాయి. తాజాగా ఏపీలోని హై కోర్ట్ లో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 30 లోగా వీటికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.
పోస్టుల వివరాలు : అసిస్టెంట్ 71; ఎగ్జామినర్ 29; టైపిస్ట్ 35; కాపీయిస్ట్ 39.
అర్హతలు : ఆయా పోస్టును బట్టి డిగ్రీ, టెక్నికల్ విద్య(టైపింగ్) లో ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
వయసు : 18-42 ఏళ్ళ మధ్య ఉండాలి. ఆయా కేటగిరీల వారీగా వయో సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక : ఆన్ లైన్ టెస్ట్
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుము : సాధారణ కేటగిరికి 800 మిగిలిన వారికి 400 చెల్లించాల్సి ఉంటుంది.
ఇతర పూర్తి వివరాలకు సంస్థ అధికారిక వెబ్ సైట్ : https://hc.ap.nic.in/ చూడగలరు.
***********************************************************************************************
ఏపీలోనే మరో నోటిఫికేషన్ : తూర్పు విద్యుత్ సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ జారీచేయబడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ లైన్ మెన్ గ్రేడ్ 2 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీలు 398 ఉన్నాయి. ఆయా సర్కిల్స్ వారీగా ఉద్యోగాల ఖాళీలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం 88; విజయనగరం 74; విశాఖపట్నం 71; రాజమండ్రి 122; ఏలూరు 43.  
అర్హతలు : ఎలక్ట్రికల్ వైరింగ్ విభాగంలో ఐటిఐ లేదా ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లయెన్సెస్ విభాగంలో రెండేళ్ల ఒకేషనల్ ఇంటర్మీడియట్ చేసి ఉండాలి.
వయోపరిమితి : 18 నుండి 35 ఏళ్లలోపు ఉండాలి.
ఎంపిక విధానం : రాతపరీక్ష లో ఎంపిక అయిన వారికి శారీరిక దారుడ్య పరీక్షలు ఉంటాయి.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
రాతపరీక్ష : అక్టోబర్ 10(11-12.45 వరకు) వీటి ఫలితాలు అక్టోబర్ 22న విడుదల చేస్తారు.
శారీరిక దారుడ్య పరీక్షలు : నవంబర్ 1-6 వరకు జరుగుతాయి(సైకిల్ తొక్కడం, విద్యుత్ స్తంభం ఎక్కడం, మీటర్ చూడటం)
తుది జాబితా విడుదల : నవంబర్ 15
నియామకాలు : నవంబర్ 17
ఇతర వివరాలకు :  https://www.apeasternpower.com/ చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: