పలు ఉద్యోగాల భర్తీ .. తొందర పడాలి ..

కరోనా కాలంలో కూడా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ నియామకాలు చేస్తూ, నిరుద్యోగులకు ఊరట నిస్తున్నాయి. తాజాగా బెంగుళూరు లోని రైల్ వీల్ కర్మాగారంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. అప్రెంటిస్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 192 ఖాళీలు ఉన్నాయి. ఈ నెల 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామకం ద్వారా మేనిఫెస్ట్, ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఎలక్ట్రీషియన్ విభాగాలలో దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన వారికి స్టైఫండ్ ఇవ్వనున్నారు.
దరఖాస్తులు సంస్థ అధికారిక వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకొని, సంస్థ చిరునామాకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపాల్సి ఉంది.
ఆయా విభాగాలలో ఖాళీలు ఇలా ఉన్నాయి. ఫిట్టర్ 85; మెషినిస్ట్ 31; మెకానిక్ 8; టర్నర్ 5; సిఎన్ సి ప్రోగ్రామింగ్ మరియు ఆపరేటర్ 23; ఎలక్ట్రీషియన్ 18; ఎలక్ట్రానిక్ మెకానిక్ 22.
దరఖాస్తు చివరి తేదీ నుండి 45 రోజుల లో ఎంపికైన అభ్యర్థుల  జాబితా విడుదల చేస్తారు. అనంతరం పది రోజులలో శిక్షణ ప్రారంభం అవుతుంది.
అర్హత : పదవతరగతి లో పాస్ అవడంతో పాటుగా సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ పాస్ అవ్వాల్సి ఉంది.
స్టైఫండ్ : సిఎన్ సి ప్రోగ్రామింగ్ మరియు ఆపరేటర్ కు 10,899 రూపాయలు; మిగిలిన వారికి 12,261 రూపాయలు.
దరఖాస్తు రుసుము : 100 రూపాయలు. ఎస్టీ, ఎస్సి , మహిళలకు, దివ్యంగులకు రుసుము లేదు.
అధికారిక వెబ్ సైట్ : https://rwf.indianrailways.gov.in/
దరఖాస్తు పంపాల్సిన చిరునామా :
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
ది సీనియర్ పర్సనల్ ఆఫీసర్,
పర్సనల్ డిపార్ట్‌మెంట్,
రైల్ వీల్ ఫ్యాక్టరీ,
యెలహంక, బెంగళూరు- 560064.

గమనిక : దరఖాస్తు కు అవసరమైన పత్రాలు జతపరచాల్సి ఉంది. దరఖాస్తు కాపీని ఒకటి జిరాక్స్ తీసుకోని భవిష్యత్తు అవసరాలకు జాగర్త చేసుకోవాలి. దరఖాస్తులను రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: