వంద ఇంటర్న్ షిప్స్ ... వారికే అవకాశం ..

టెక్నికల్ విద్యార్థులకు 2021 సంవత్సరానికి గాను ఉజ్జ్వలా కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ లాబరేటరీ ఇంటర్న్ షిప్ ల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. ఇందులో ఎంపికైన వారికి సంస్థ లాబరేటరీ ఇంటర్న్ గా అవకాశం ఇవ్వనుంది. సంస్థ ప్రస్తుతం వంద ఖాళీలు ఉన్నట్టు ప్రకటించింది.వీరికి ఆరు నెలల పాటు ఇంటర్న్ అవకాశం ఇస్తుంది సంస్థ.
ఈ సంస్థ వివిధ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ ను తయారు చేసి, వివిధ వర్గాలకు సరఫరా చేస్తుంది. ప్రస్తుతం వీరు జీవ ఎరువులు, సూక్ష్మ పోషక ఎరువులు తదితర వ్యాపార లావాదేవీలు చేస్తున్నారు. సహజంగా ఇప్పటి కాలంలో సంస్థలో పనిచేసి, ప్రత్యక్ష అనుభవం పొందిన వారికి అవకాశాలు వస్తున్నందున వివిధ సంస్థలు ఆయా నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులకు ఇంటర్న్ అవకాశాలు కల్పించడం చూస్తూనే ఉన్నాం. అటువంటి ఈ అవకాశాన్ని అభ్యర్థులు అందిపుచ్చుకోగలరని సంస్థ ధరఖాస్తులు ఆహ్వానిస్తుంది. తద్వారా అభ్యర్థులకు ఎన్నో విషయాలు ప్రాథమిక దశలోనే తెలుసుకొనే అవకాశాన్ని కల్పిస్తున్నది ఈ సంస్థ.
ఆరు నెలల ఈ ఇంటర్న్ కార్యక్రమానికి రెండు లేదా మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ లో పొందు పరిచిన విధంగా అభ్యర్థులు ఆయా విద్య, అనుభవాలకు సంబందించిన పత్రాలను సంస్థకు చూపించాల్సి ఉంటుంది.
ఎంపికైన అభ్యర్థులు సంస్థ తయారు చేసే ఎరువులు, పురుగుల మందులను విశ్లేషించడం మరియు వాటిపై శాస్త్రీయ పరిశోధన, ప్రయోగాలు నిర్వహించాల్సి ఉంటుంది. అవి చేసే వారికి సహకరించాల్సి ఉంటుంది. అలాగే సంస్థ చేపట్టే ప్రయోగాలను ప్రణాళిక చేయడం, వాటిని ట్రయల్స్ చేయడం, వాటి సంఖ్యా పరమైన సమాచారాన్ని పొందుపరచడం, దానిపై విశ్లేషణ జరపడం వంటివి వీరి బాధ్యతలు. అలాగే సదరు ప్రయోగాలకు వాడిన పరికరాలు శుభ్రపరచడం, వాటిని భద్ర పరచడం వంటివి చేయాలి. అలాగే వీటన్నిటిని ఆయా ప్రయోగాలకు అనుగుణంగా అందుబాటులో ఉంచాలి.
ఇక దరఖాస్తు కంటే ముందు తులిప్ నందు తగిన వివరాలు ఇచ్చి యూజర్ నేమ్ మరియు పాస్ వార్డ్ పొంది , తద్వారా లాగిన్ అయ్యి, ఈ వెబ్ సైట్  internship.aicte-india.org లోకి వెళ్లి ఆన్ లైన్ లో ఇంటర్న్ షిప్ కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆఖరి తేదీ, 31, అక్టోబర్ 2021.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: