ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు తప్పనిసరి.. ఎప్పుడంటే..?

Purushottham Vinay
కరోనా మహమ్మారి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో లో టెన్త్‌, ఇంటర్ సెకండియర్ పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను మాత్రం ఎలాంటి పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రభుత్వం ప్రమోట్ చేయడం జరిగింది. అయితే.. ఇంటర్‌ సెకండియర్‌కు ప్రమోట్‌ అయిన విద్యార్థులంతా కూడా ఖచ్చితంగా మొదటి సంవత్సరం పరీక్షలు రాయాల్సిందేనని మంత్రి సబిత స్పష్టం చేయడం జరిగింది.అలాగే పరీక్షలు ఎప్పుడనేది కూడా త్వరలోనే ప్రకటిస్తామన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో గతేడాది ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులను ప్రభుత్వం పరీక్షలు నిర్వహించకుండా సెకండియర్‌కు ప్రమోట్‌ చేయడం జరిగింది. వీరికి మొదటి సంవత్సరం పరీక్షలు ఐచ్ఛికమనే ప్రచారం కూడా ముందు జరిగింది. కానీ మంత్రి మాత్రం దీన్ని కొట్టిపారేశారు. విద్యార్థులంతా కూడా పరీక్షలు తప్పనిసరిగా రాయాల్సిందేనంటూ స్పష్టత ఇవ్వడం జరిగింది.ఇక దీని వెనుక కూడా ఒక బలమైన కారణాలున్నట్టు తెలుస్తోంది.

కరోనా మహమ్మారి మూడోదశ ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఒకవేళ రెండవ సంవత్సరం పరీక్షలనూ నిర్వహించలేకపోతే అప్పుడు పరిస్థితి ఏమిటనే సందేహాలు ఇప్పుడు విద్యాశాఖ వర్గాల్లో వ్యక్తమయ్యాయి.మొదటి సంవత్సరం మార్కుల్నే ప్రాతిపదికగా తీసుకోవాల్సి ఉంటుందని ఇంటర్‌ బోర్డు అధికారులు ఇప్పుడు అభిప్రాయపడినట్లు తెలిసింది.ఈ నేపథ్యంలోనే ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది. కాబట్టి విద్యార్థులు మొదటి సంవత్సరం సబ్జెక్టులను ప్రిపరేషన్‌ ప్రారంభించడం మంచిది.అలాగే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పడం జరిగింది. వివిధ కోర్సుల్లో ప్రవేశం కోసం ఇంటర్‌మీడియేట్ లో కనీస అర్హత మార్కుల నిబంధనను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఎంసెట్, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా, ఐదేళ్ల ఎంబీఏ ఇంకా ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్స్‌ పొందాలంటే ఇంటర్‌‌లో పాస్ అయితే చాలు అని పేర్కొనడం జరిగింది. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో వార్షిక పరీక్షలు జరగకపోవడం ఇంకా విద్యార్థులకు పాస్‌ మార్కులు వేయడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: