నీట్ ఎగ్జామ్ వాయిదా వెయ్యాలని కోరుతున్న విద్యార్థులు..

Purushottham Vinay
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అనేక పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే కరోనా పరిస్థితులు మళ్ళీ కాస్త తగ్గుముఖం పట్టడంతో వాయిదా పడిన పరీక్షలను ప్రస్తుతం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. దేశ వ్యాప్తంగా అనేక ప్రవేశ పరీక్షలు ఇప్పటికే జరుపుతుండగా మరి కొన్ని పరీక్షలు కూడా జరపవలసి ఉంది.ఇక ఈ నేపథ్యంలో నీట్ 2021 పరీక్షను సెప్టెంబర్ 12న జరుపనున్నట్లు గతంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. అయితే ఈ పరీక్షను వాయిదా వేయాలని విద్యార్థులు విపరీతంగా డిమాండ్ చేస్తున్నారు. ఇక దీంతో నీట్ పరీక్ష వాయిదా పడడం ఖాయమన్న ప్రచారం కూడా సాగింది.ఇక ఈ అంశంపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) డైరెక్టర్ జనరల్ స్పందించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ NEET 2021 పరీక్షను వాయిదా వేసే ప్రసక్తి లేదని స్పష్టం కూడా చేయడం జరిగింది.

కరోనా వైరస్ నిబంధనలు పాటిస్తూ సెప్టెంబర్‌ 12న పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించడం జరిగింది.ఇక దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాలకు ఏటా నిర్వహించే నీట్ యూజీ పరీక్షకు లక్షలాది మంది విద్యార్థులు హాజరవుతూ వున్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలోనే ఈ పరీక్ష జరగాల్సి ఉండగా.. కరోనా మహమ్మారి కారణంగా పలు మార్లు వాయిదా పడటం జరిగింది. ఇక ప్రస్తుతం కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో సెప్టెంబర్ 12వ తేదీన ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించడం జరిగింది.అలాగే పరీక్ష నిర్వహణ ఏర్పాట్లను సైతం ప్రారంభించడం జరిగింది.ఇక అయితే వచ్చే నెలలో పలు జాతీయ ఇంకా రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలు అనేవి ఉన్న నేపథ్యంలో నీట్ యూజీ పరీక్షకు హాజరుకాలేమని.. దయచేసి పరీక్ష తేదీ మార్చాలని పలువురు విద్యార్థులు సోషల్ మీడియా ద్వారా కేంద్రాన్ని కోరారు. దీంతో పోస్ట్ పోన్ నీట్ యూజీ 2021 హ్యాష్ ట్యాగ్ (#PostponeNEETUG 2021) ట్రెండింగ్‌లో పెడుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో నీట్ యూజీ పరీక్షలు వాయిదా వేసే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడటం జరిగింది. ఇక ఈ ఊహాగానాలకు చెక్ పెడుతూ.. ఎన్టీఏ అధికారులు స్పష్టత ఇవ్వడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: