ఏపీలో విద్యా రంగంలో సంస్క రణల అమలు

Santhi Kala

ఏపీలో విద్యా రంగంలో సంస్క రణల అమలు దిశగా జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది.ఉన్నత విద్యలోకి ప్రవేశించాడానికి తొలి అడుగైన ఇంటర్మీడియట్ నుంచి మార్పులు చేస్తూ ప్రక్షాళన చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది.రాష్ట్రంలో విద్యాను వ్యాపారంగా మార్చి అటు తల్లిదండ్రులను,ఇటు విద్యార్థులను వేధింపులకు దిగుతున్న కార్పోరేట్, ప్రయివేటు విద్యా సంస్థలను కట్టడి చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్న ప్రభుత్వం,నాలుగు దశాబ్దాలుగా ఆడిందే ఆటగా పడిందే పాటగా సాగిన విద్యా మాఫియాను అరికట్టేందుకు క్షేత్ర స్థాయిలో కఠిన చర్యలకు సిద్ధమవుతోంది.

ఏపీలో ఇంటర్మీడియట్ విద్యార్ధులను ఉన్నతంగా తీర్చిదిద్దెందుకు ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహార్తిస్తూన్న  విద్యా సంస్థల విషయంలో కఠిన చర్యలకు సిద్ధమవుతోంది.4 దశాబ్దాలుగా తాము ఆడిందే ఆటగా పాడిందే పాటగా నడిచిన కార్పొరేట్,ప్రయివేటు ఇంటర్మీడియట్ విద్యా  సంస్థల విషయంలో  కట్టడికి పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి నిబంధన లను ఉల్లంగిస్తూన్న కాలేజీల భరతం పట్టేందుకు ఇంటర్ బోర్డు రంగం సిద్ధం చేస్తోంది.అందులో భాగంగా ఇంటర్మీడియట్లో కీలకమైన సంస్కరణలు అమలు చేస్తూ బోర్డు ఆదేశాల అమలు చేయని  కాలేజిల విషయంలో ఇకపై తప్పనిసరిగా సీరియస్ యాక్షన్ ఉంటుందనే సంకేతాలను పంపుతోంది.గతంలో ఇంటర్ అడ్మిషన్ల కోసం అక్రమంగా ఫీజుల వసూళ్లు,అనుమతి లేని కాలేజీల నిర్వహణ,కాలేజీల అనుమతులతో కోచింగ్ సెంటర్ల నిర్వహణ విషయంలో ఇకపై సీరియస్ గా వ్యవహరించనుంది ఏపీ ఇంటర్ బోర్డు.గతంలో ఇంటర్మీడియట్ కాలేజి అనుమతి తీసుకొని కాలేజి కోడ్ ప్రదర్శించకుండ ఐఐటీ,మెడిసిన్,ఒలంపియాడ్ అంటూ  మల్టీ లెవల్ మార్కెటింగ్,పబ్లిసిటీకి  పాల్పడితే అనుమతి రద్దు చేస్తామని అన్ని కాలేజీల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసింది.

ఇదిలా ఉంటె ఒకప్పుడు ఇంటర్మీడియట్లో అడ్మిషన్లు మొదలు కొని రెండేళ్ల ఇంటర్ కోర్సులు పూర్తయ్యే వరకు కాలేజి యాజమాన్యాలు చేస్తున్న అవతవకలపై ఈ ఏడాది నుంచి పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయనుంది ఎపి ఇంటర్ బోర్డు.గతంలో అడ్మిషన్ కోసం ఫీజులు చెల్లించి ఎస్సెస్సి సర్టిఫికెట్లు,మెమోలు,కాలేజీల్లో అప్పగించాలని విద్యార్థులపై యాజమాన్యాలు ఒత్తిడి చేస్తే కోర్సు పూర్తయిన తరువాత ఫీజులు చెల్లించలేదని,హల్ టికెట్స్,సర్టిఫికేట్లు నిలిపివేయాలన్న యజమాన్యాల ఒత్తిడికి  తలొగ్గాల్సిన  పరిస్థితి ఉన్న నేపద్యంలో వీటిని కట్టడి చేయడం కోసం ఆన్లైన్ అడ్మిషన్ సిస్టంను అందుబాటులోకి తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కాలేజీలను బోర్డు ఆధీనంలో 24 అవర్స్  మానిటర్ చేసేలా సంస్కరణలను అమలు చేయనుంది ఇంటర్మీడియట్ బోర్డు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: