స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. నెలకి 7,800/- స్కాలర్ షిప్..

Purushottham Vinay
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ ప్రకటించడం జరిగింది. వేరు వేరు యూనివర్సిటీల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు చేస్తున్న విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్స్ అందించడం జరుగుతుంది. ఇక వెనకబడ్డ కులాలైన ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన 1,000 మంది విద్యార్థులకు యూజీసీ స్కాలర్‌షిప్స్ అనేవి లభిస్తాయి. టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ అలాగే ఫార్మసీ ఇంకా ఇతర ప్రొఫెషనల్ కోర్సులు చేసే విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్స్ కోసం వెంటనే అప్లై చేసుకోవచ్చు. మాస్టర్స్ ఇన్ ఇంజనీరింగ్ (ఎంఈ) ఇంకా మాస్టర్స్ ఇన్ టెక్నాలజీ (ఎంటెక్ ) కోర్సులు చదివే విద్యార్థులకు నెలకు రూ.7,800లు, అలాగే ఇతర పీజీ కోర్సులు చదివే విద్యార్థులకు నెలకు రూ.4,500 స్కాలర్‌షిప్ లభిస్తుంది. అలాగే కోర్సులో చేరిన దగ్గర నుంచి ఈ స్కాలర్‌షిప్స్ అనేవి వర్తిస్తాయి. అయితే ఇక ఈ స్కాలర్‌షిప్స్‌కు దరఖాస్తు చేసేముందు విద్యార్థులు కొన్ని నియమ నిబంధనల్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి.

ఇక ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్, ఎంఎస్‌డబ్ల్యూ ఇంకా ఎంఏ ఇన్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం లాంటి కోర్సుల్ని నాన్ ప్రొఫెషనల్ కోర్సులుగా పరిగణించడం జరుగుతుంది.కాబట్టి ఈ కోర్సులు చేసే విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్స్ పొందేందుకు మాత్రం అర్హులు కాదు. ఇక కరస్పాండెన్స్ లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా ప్రొఫెషనల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు చేసే వారికి కూడా ఈ స్కాలర్‌షిప్ స్కీమ్ అనేది వర్తించదు.రెండు సంవత్సరాలు లేదా మూడు సంవత్సరాలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు చదువుతున్నవారు ఈ స్కాలర్‌షిప్ కి అప్లై చేసుకోవచ్చు.ఈ స్కాలర్‌షిప్‌లకు సెలెక్ట్ అయిన విద్యార్థుల అకౌంట్‌లోకి యూజీసీ నేరుగా స్కాలర్‌షిప్ డబ్బుల్ని ట్రాన్స్‌ఫర్ చేయడం జరుగుతుంది.ఇక విద్యార్థులు తర్వాత తరగతికి ప్రమోట్ కనుక కాకపోతే స్కాలర్‌షిప్ అనేది రాకుండా ఆగిపోతుంది.ఇక ఈ స్కాలర్ షిప్ కి అర్హత, ఆసక్తిగల విద్యార్థులు నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ https://scholarships.gov.in/ లో అప్లై చేయాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: