స్కూల్ రక్కసి : బడి మారింది..ఇదే స్థాయిలో చదువూ?

RATNA KISHORE
అందమయిన బాల్యానికి
నిజంగానే భరోసా
ఎంపిక చేసిన బడులకు
కొత్త హంగు కొత్త రంగు
పాలపొంగు సంతోషాలు
కావివి మంచి ప్రతిపాదనలతో
రూపుదిద్దుకున్న ప్రాంగణాలివి
మంచి బడి మంచి ఆనందానికి సంకేతం
థాంక్ యూ సీఎం సర్..
బడి సరే మరి! చదువు!
ఒకనాటి బృందావనం బడి అని గుర్తించాను. అయ్యో! బీటలువారిన గోడలు,రంగులు వెలసిన గోడలు, వృద్ధాప్యం వచ్చిన రీతిలో పాఠశాల..ఒక వైపు వాలి భవనం..ఎప్పుడు కూలుతుందో తెలియని వైనం. ఇన్నింటి దగ్గర బడి ఎలా ఉంది? అని ప్రశ్నిస్తూ పో యాను. ఇప్పుడు బడి ఎలా ఉంది? సుందర తీరాలకు ఆనవాలు అని నిర్వచిస్తామా ఆ వి ధంగా ఉంది. మంచి మార్పునకు సంకేతం అని చెబుతామా ఆ విధంగా ఉంది. పోలికలూ పొలికేకలూ కాదు ఇదే వాస్తవం. మంచి బడి మంచి కలలకు సాకారం ఇచ్చేందు కు ఊతం అవుతుంది. నిర్మాణం నా వంతు మంచి చదువు నాణ్యత మీ వంతు అని చెప్పారు సీఎం. పాటిస్తారా?
నాడు - నేడు .. రాజధాని అమరావతిలో ఉండి చెప్పారా మాట..బడి గతి మార్చాలి ఇందుకు మీకు డబ్బులిస్తున్నాం అని!3,669 కోట్ల రూపాయలు మొదటి విడత. స్పీకర్ సీతారాం ఊళ్లో కూడా మంచి బడులు లేవు.. ఆ మాటకు వస్తే సీఎం సొంత ఊళ్లో కూడా మంచి బడులు లేవు. ఇవన్నీ మార్చేందుకు తనవంతు బాధ్యతగా భావించి బడిని గుడి చేయాలన్న తలంపుతో నిధులు ఇచ్చారు. వేళకు హెచ్ఎంలు వచ్చి నిర్మాణపు పనులు పరిశీలించకపోతే  దగ్గరుండి ఆ పనులు పర్యవేక్షించేలా ఆదేశాలు ఇచ్చారు. క రోనా మహమ్మారి ఎలా ఉన్నా ఎంత తీవ్రతతో ఉన్నా పనులు ఆపేందుకు ఇష్టపడలేదు. ఎంపిక చేసిన బడులలో మౌలిక  వసతుల కల్పన బాగుంది. 15,715 పాఠశాలల కు దక్కిన గౌరవం ఇది.  గదులన్నీ బెంచీలతో నిండిపోయాయి. గ్రీన్ బోర్డు వచ్చింది..మరుగుదొడ్ల నిర్మాణాలూ పూర్తయ్యాయి. చేతులు కడిగే స్థలాన్ని కూడా సుందరంగా తీర్చిదిద్దారు. హై క్వాలిటీ పనులు లేకపోతే ఒప్పుకోను అని చెప్పారు సీఎం. కొందరు టీచర్లు డుమ్మా కొట్టారు. కొందరు ఇదే అదునుగా కాంట్రాక్టర్లతో ఏవో బేరాలు నడిపారు. ఇవేవీ వద్దని సీఎం చెప్పారు. అనుకున్న విధంగా బడి గుడి అయింది. మరి! చదువు..
ప్రభుత్వ బడుల్లో చదువులు
ప్రభుత్వ బడుల్లో ఫలితాలు
చదువు ఫలితం రెండూ బాగుండాలి. బాగు పడాలి..బడి బాగు పడిందన్న ఆనందంలో చదువును కూడా బాగుపర్చాలి..వీలుంటే ఎక్కువగా డిజిటల్ ఎడ్యుకేషన్ అందించేలా చూడండి. అలానే పిల్లలకు ఎప్పటికప్పుడు ఆటలపై శ్రద్ధ పెంచంండి. ఇంగ్లీషు ముఖ్య మే నా తెలుగు భాషకు గౌరవం ఇస్తూ ఆంగ్ల చదువు నేర్పండి. మీ బిడ్డలు ఇక్కడి నుంచి ఉన్నత పౌరులుగా ఎదిగి సమాజంలోకి రావాలంటే బాగా చదువు చెప్పే టీచరు ఎంతో ముఖ్యం. వేళకు బడికి రాని టీచరును నిలదీయండి.. పాఠాలు బాగా చెప్పే టీ చరు ను నెత్తిన పెట్టుకోండి. బడి బాగుంది కదా! ఆ వసతులు అన్నీ నిలుపుకోవాలి మీరు.. పిల్లలూ! ఆల్ ద బెస్ట్ ...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: