NEET PG 2021 అభ్యర్థులకు శుభవార్త.. ఆగస్టు 20 వరకు ఛాన్స్.. పూర్తి వివరాలు..

Purushottham Vinay
ఇక కరోనా వైరస్ సెకండ్ వేవ్ కాస్త తగ్గుముఖం పట్టడంతో వాయిదా పడిన పరీక్షలకు సంబంధించి ఇప్పుడిప్పుడే స్పష్టత అనేది వస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా వివిధ ఎండీ (డాక్టర్ ఆఫ్ మెడిసిన్)/ ఎంఎస్ (మాస్టర్ ఇన్ సర్జరీ) ఇంకా పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించనున్న నీట్ పీజీ– 2‌‌021 పరీక్ష సెప్టెంబర్ 11న జరగబోతుంది. ఇక ఈ మేరకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ ప్రకటన విడుదల చెయ్యడం జరిగింది.ఇక అలాగే నీట్‌ పీజీ 2021 పరీక్షకు మరో నెల రోజుల మాత్రమే గడువు ఉంది.అలాగే ఆగస్టు 16 మధ్యాహ్నం 3 గంటలకు నీట్ పీజీ–2021 రిజిస్ట్రేషన్ ఇంకా ఎడిట్ విండో రీఓపెన్‌ కాబోతుంది. ఇక ఈ నెల 20 వరకు అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.ఇక ఈ రిజిస్ట్రేషన్ లింక్ https://nbe.edu.in/ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటుందట.

ఈ సంవత్సరం జూలై 1 నుంచి సెప్టెంబర్ 31 మధ్య ఇంటర్న్షిప్ పూర్తి చేయనున్న స్టూడెంట్స్ కూడా నీట్ పీజీ పరీక్షకు దరఖాస్తు చేసే అవకాశం కల్పిస్తున్నట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ విభాగం పేర్కొనడం జరిగింది.ఇక ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తు కేటగిరీలో ఏమైనా తప్పులు చేసి ఉంటే ఈ విండో ద్వారా సరిచేసుకోవచ్చని తెలిపడం జరిగింది. అయితే కేటగిరీ మినహా మిగతా వివరాలను సరిచేసుకోలేమని స్పష్టం చేయడం జరిగింది.ఇక కేంద్రం ఇటీవల మెడికల్ సీట్లలో రిజర్వేషన్లపై కొత్త మార్గదర్శకాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జులై 30 వ తేదీన భారత ప్రభుత్వం జీవోను విడుదల చేయడం జరిగింది. దీని కింద మెడికల్ సీట్లలో ఓబీసీ ఇంకా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తిస్తాయని పేర్కొనడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలో చాలా మంది అభ్యర్థులు కేటగిరీ ఇంకా ఈడబ్ల్యూఎస్ స్టేటస్ సవరణలకు అవకాశం కల్పించాలని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఎన్టీఏ)ను కోరడం జరిగింది. ఇక దీంతో వారికి మరోసారి సవరణకు అవకాశం కల్పించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: